బీఎస్పీ మండల అధ్యక్షుడిగా చిప్పలపల్లి సురేష్ ఎన్నిక
గుండాల, క్విక్ టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఆలేరు నియోజకవర్గం అధ్యక్షులు గడ్డం శ్రీకాంత్ అధ్వర్యంలో గుండాల మండల కమిటీ ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం వీరస్వామి పాల్గొని ప్రసంగించారు. బహుజన రాజ్యంలో ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీల ఐక్యత చేసి భావితరాల భవిష్యత్ మార్చడం కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు. బీఎస్పీ మండల అధ్యక్షుడిగా చిప్పలపల్లీ సురేష్ నియమితులయ్యారు. అధ్యక్షులు మాట్లాడుతూ నాకు సహకరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గం అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యక్షులుగా మందుల రాజు ప్రధాన కార్యదర్శిగా తాండ్ర గణేష్, బొనాసి ఉదయ్, కోశాధికారిగా తాండ్ర సుదర్శన్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మండల సీనియర్ నాయకులు బసెట్టి అర్జున్ ఇటుకల బాను ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
