Kavali : కావ్య కృష్ణారెడ్డి శిబిరం తప్పిదమే బీఎంఆర్ ఆగ్రహానికి కారణం
- బీద సమక్షంలో ఇద్దరు సర్పంచులు, ఒక ఎంపీటీసీ ఒక వార్డు ముఖ్య నేత వైసీపీలో చేరిక
On
Kavali : కావలి, (క్విక్ టుడే) : టిడిపి ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కావ్య కృష్ణారెడ్డి శిబిరం చేస్తున్న కొన్ని తప్పిదాలే ఈరోజు రాజ్యసభ సభ్యులు వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బీద మస్తాన్ రావుకు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. బీఎంఆర్ గ్రూప్స్ లో ఎంప్లాయ్ గా ఉన్న గొళ్ల మురళి, కావ్య ఇంటి దగ్గర ఉన్న రామాయపట్నం పోర్టు పనిమీద వెళుతుండగా కావ్య శిబిరం దగ్గర ఉన్న కొందరు మురళిని పిలిచి కావ్యకు పరిచయం చేసి ఫోటోలు తీసి, తీసిన ఫోటోలను ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో హడావుడి చేసి మస్తాన్ రావు పై బురదజల్లే కార్యక్రమం చేయటం ఆయనకు ఆగ్రహం తెప్పించింది.
దానికి ప్రతి చర్యగా కావ్య తో ఉన్నటువంటి టీడీపీ నేతలైన ఇద్దరు మాజీ సర్పంచులు సిరిపురం సర్పంచ్ కమతం బలరాం, కొత్తపల్లి మాజీ సర్పంచ్ పొనగంటి మాల్యాద్రి నాయుడు, అనగారిపాళెం మాజీ ఎంపీటీసీ మక్కి భాస్కర్ ,11టిడిపి ముఖ్య నాయకులు మైనంపాటి జగదీష్ ,ఆయన సతీమణి మంజులను వైసీపీలోకి ఆహ్వానించి కండువాలు కప్పి వైసీపీలో చేర్చి ప్రతీకారం తీర్చుకొనేలా చేసినట్లు సమాచారం. వీటితోనే కాకుండా ఇంకా నియోజకవర్గలోని టిడిపి నేతలతో బీద మస్తానురావు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. కావ్య శిబిరం చేసిన తొందరపాటు నిర్ణయం టిడిపిలో చీలికలు తెచ్చే వరకు వస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ముందు ముందు కావలి నియోజకవర్గం లో జరిగే రాజకీయ క్రీడలు తీవ్ర హిట్ పుట్టించకపోవు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
