YS Jagan Attack : సీఎం జగన్ తనపై తానే దాడి చేయించుకున్నారా? ఇది మరో కోడికత్తి డ్రామానా?
దానికి కారణం.. సీఎం జగన్ పై దాడి జరగడం. నిజానికి సీఎం జగన్ పై ఇలా దాడి జరగడం ఇదే తొలిసారి ఏం కాదు. చాలాసార్లు ఇదివరకు దాడి జరిగిన మాట వాస్తవం కానీ.. ఎన్నికల ముందు అది కూడా ఎంతో సెక్యూరిటీ ఉన్న సీఎం జగన్ సభలో ఇలా జగన్ పై అంత ఈజీగా రాయి విసరడం సాధ్యం అవుతుందా? విసిరినా అది కరెక్ట్ గా జగన్ కు తగులుతుందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఏపీ ప్రజల్లో మెదులుతున్నాయి.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ గంగానమ్మ గుడి దగ్గర మేమంతా సిద్ధం యాత్ర జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే.. యాత్ర జరుగుతున్న సమయంలో పవర్ కట్ అయింది. అసలు.. ఒక సీఎం యాత్ర జరుగుతుంటే పవర్ ఎవరు కట్ చేశారు. సీఎం ఒక్కరికే కాదు..
వైసీపీ అభ్యర్థికి కూడా గాయాలు అయ్యాయి అంటున్నారు.అంత మందిలో రాయితో సరిగ్గా సీఎం మీదికి రాయి విసిరే సాహసం ఎవరు చేశారు? అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ప్రస్తుతానికి జగన్ కు ప్రమాదమేమీ లేదు. రెండు మూడు రోజుల్లో కోలుకుంటారని డాక్టర్లు చెబుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఖచ్చితంగా సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు.
ఓవైపు పవర్ లేదు.. మరోవైపు కనీసం పెద్ద పెద్ద లైట్లను కూడా అమర్చలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా చీకటే ఉంది. అసలు.. అంత మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా.. ముఖ్యమంత్రిపై రాయి విసిరింది ఎవరు అనేది గుర్తించలేకపోయారు. అంత మందిలో రాయి విసిరిన వ్యక్తి ఎలా తప్పించుకున్నాడు.. అని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు సీఎం జగన్ పై జరిగిన దాడిని ప్రధాని మోదీ కూడా ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఖండించారు. పలువురు రాజకీయ నేతలు... సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అయితే.. టీడీపీ నేతలు మాత్రం ఇదంతా కావాలని వైసీపీ నేతలు చేసిన ప్లాన్ గా అభివర్ణిస్తున్నారు. ఇదివరకు కోడికత్తి డ్రామా ఎలాగైతే జరిగిందో.. ఇది కోడికత్తి డ్రామా 2.0 అంటూ దుయ్యబట్టారు.

సీఎం పర్యటనలో ఎందుకు కరెంట్ పోయింది. ఇదంతా కావాలని చేసిన ప్లాన్ అని స్పష్టం అవుతోంది అని టీడీపీ నేతలు అన్నారు. ఘటన జరిగిన కొంత సేపటికే ఇదంతా చంద్రబాబు చేయించారంటూ వైసీపీ నేతలు చెప్పడం వెనుక పక్కా ప్లాన్ ఉందని స్పష్టం అవుతోందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.
జగన్ సభ జరుగుతున్న సమయంలో.. జగన్ చుట్టూ ఉన్నది పోలీసులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు. మరి.. ఒక వ్యక్తి రాయి విసరగానే ఎందుకు ఆ వ్యక్తిని వీళ్లు పట్టుకోలేదు. ఎందుకు కరెంట్ సరఫరా ఆపేశారు. అది క్యాట్ బాల్ అని జగన్ అనుకూల మీడియాకు వెంటనే ఎలా తెలిసింది.. అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ కు గాయం వల్ల ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రస్తుతానికి ఆపేశారు. ఆదివారం మేమంతా సిద్ధం యాత్ర ఉండదు. రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకోవాలని జగన్ కు వైద్యులు సూచించడంతో బస్సు యాత్ర మళ్లీ ఎప్పుడు ఉంటుందో త్వరలో ప్రకటిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
