YS Jagan Mohan Reddy : హైటెక్ సిటీ, సింగపూర్ అన్నాడు.. చేశాడా? చంద్రబాబుపై జగన్ ధ్వజం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఇవాళ సాయంత్రం 9 వ రోజు నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఉన్నాడు. కానీ.. పేదల పక్షాన మీ బిడ్డ జగన్ ఉన్నాడని జగన్ స్పష్టం చేశారు.

YS Jagan Mohan Reddy : నేను అడిగే ఏ ప్రశ్నకు కూడా చంద్రబాబు దగ్గర సమాధానం లేదు
14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు పొత్తులు ఎందుకు? పొత్తులు పెట్టుకుంటేనే గెలుస్తాం. లేకపోతే గెలవం అని భయపడుతున్నారా? చంద్రబాబు నిజంగా తన 14 ఏళ్ల పాలనలో అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. అలాగే.. నేను అడిగే ప్రశ్నలకు కూడా చంద్రబాబు దగ్గర సమాధానం లేదు.. అని జగన్ మండిపడ్డారు.
మంచి చేసిన మనకు మద్ధతు ఇవ్వండి. ఇంకో 5 వారాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇది జగన్, చంద్రబాబు మధ్య యుద్ధం కానే కాదు.. మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది. దాన్ని కొనసాగించాలంటే.. మీ మద్దతు కావాలి. ఒక్కసారి మీరు నన్ను ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు సంక్షేమం అందించా. ఇప్పటి వరకు రూ.2 లక్షల 70 వేల కోట్లను పేదల ఖాతాల్లో వేశాం. మేనిఫెస్టోలో ప్రకటించిన 99 శాతం హామీలను నెరవేర్చాం. ఇంటింటికి సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. లంచాలు లేవు.. వివక్ష లేదు.. అలాంటి వ్యవస్థను మీ ముందుకు తీసుకొచ్చామన్నారు.

చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలే మార్చాం. వైద్య రంగంలో కూడా పలు మార్పులు తీసుకొచ్చాం. సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ, ప్రతి గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లీనిక్స్, దిశా యాప్, అవ్వా తాతల కోసం సంక్షేమం.. ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న 99 శాతం హామీలు నెరవేర్చాం.
మళ్లీ మీ ముందుకు వచ్చాం. ఈ 5 ఏళ్ల కాలంలో మంచి జరిగి ఉందని మీరు అనుకుంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి. పేదలకు ఈ మంచి అలాగే కొనసాగాలంటే మన ప్రభుత్వమే మళ్లీ రావాలి. మరో ఐదేళ్ల పాటు మీరే మాకు తోడుగా ఉండాలి. ఫ్యాన్ కు రెండు ఓట్లు వేయండి.. ఇంటింటికి అభివృద్ధి మళ్లీ జరుగుతుంది అని జగన్ కావలి ప్రజలను కోరారు.
