YS Vivekananda Reddy : ఎన్నికల వేళ ఏపీలో మరో అలజడి.. రెండో భార్య, కొడుకుతో వివేకానందరెడ్డి ఉన్న వీడియోలు వైరల్
దీంతో చంద్రబాబు ప్రభుత్వంపై అప్పటి ప్రతిపక్ష నాయకులు, వైసీపీ నేతలు, ప్రస్తుత సీఎం జగన్ కూడా నిప్పులు చెరిగారు. కానీ.. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయాక.. జగన్ గెలిచాక చూస్తే ఇప్పటి వరకు మళ్లీ 2024 ఎన్నికలు వచ్చే వరకు కూడా అసలైన దోషులను జగన్ ప్రభుత్వం కూడా గుర్తించలేకపోయింది.

YS Vivekananda Reddy : ఎన్నికల వేళ జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు
ఏపీలో ఎన్నికల వేళ.. వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ అటు వివేకా కూతురు సునీత, జగన్ సొంత చెల్లి షర్మిల.. ఇద్దరూ వివేకా హత్య కేసులో జగన్ ను విమర్శిస్తున్నారు. తన చిన్నాన్నను చంపిన వాళ్లకు తన సొంత అన్న జగన్ ఆశ్రయం ఇస్తున్నారని షర్మిల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
సునీత కూడా డైరెక్ట్ గానే జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చాలా రోజుల నుంచి వైఎస్ వివేకానందరెడ్డికి రెండో భార్య ఉందని, ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వైఎస్ వివేకా, తన రెండో భార్య, ఆమె కొడుకుతో ఉన్న రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అసలే ఏపీలో ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో వివేకా తన రెండో భార్యతో ఉన్న వీడియోలు ఏపీలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఎవరు షేర్ చేశారో కానీ.. ఆ వీడియోలను చూసి ఏపీ ప్రజలు, నెటిజన్లు షాక్ అవుతున్నారు.
వైఎస్ కుటుంబం అంతా అంతే నా? ఇంట్లోనే ఇంత రచ్చ పెట్టుకొని పవన్ కళ్యాణ్ కు మూడు పెళ్లిళ్లు అని సొల్లు చెపుతా ఏడుస్తాడు ఎందుకు? వైసీపీ వాళ్లకు పెళ్లాలు, పెళ్లిళ్ల గురించి తప్ప రాష్ట్రాన్ని బాగు చేసే ఉద్దేశం లేదా? మరి జగన్ ఏంటి.. పెళ్లాలు, పెళ్లిళ్లు అని క్లాస్ పీకుతాడు.
వెంకట్ రెడ్డి 2 సెట్ అప్ బిడ్డలు.. అంటూ నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోల వల్ల ఖచ్చితంగా వైసీపీకి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఈ వీడియోలపై సీఎం జగన్, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
