Business Ideas: తక్కువ పెట్టుబడితో ప్రారంభించే 5 బిజినెస్ ఐడియాలు మీకోసం..
ప్రస్తుత కాలంలో ఉద్యోగం చేయడం కంటే సొంతంగా వ్యాపారం ప్రారంభించి మంచి లాభాలు పొందుతూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన అంత డబ్బు అందరి దగ్గర ఉండదు. అయితే చేతిలో ఎక్కువగా డబ్బులు లేనివారు కూడా చాలా సులువుగా ప్రారంభించే వ్యాపారాలు కొన్ని ఉన్నాయి.
కొరియర్ సర్వీస్ బిజినెస్....

అయితే ఈ బిజినెస్ ను మొదలు పెట్టాలంటే ముందుగా ఎలాంటి ప్రొడక్ట్స్ డెలివరీ చేయగలం అనేది ఆలోచించుకుని ఈ బిజినెస్ వైపు అడుగులు వేయాలి. కస్టమర్స్ కు మంచి సర్వీస్ అందించినట్లయితే ఈ బిజినెస్ లో సులువుగా సక్సెస్ కావచ్చు.
కార్ వాష్ బిజినెస్....
ప్రస్తుత కాలంలో ప్రతి ఇంటికి ఒక కారు ఉండటం సహజంగా మారింది.కాబట్టి దీనిని మీరు అవకాశం గా తీసుకొని బిజినెస్ గా మార్చుకుంటే మంచి లాభాలను గడించవచ్చు. ఈ బిజినెస్ కోసం మీ వద్ద కొంత కాలి స్థలం ఉంటే సరిపోతుంది. అంతేకాక నేటి కాలంలో కార్ల ఉపయోగం ఎక్కువగా ఉండటం వలన ప్రతిచోట కార్లను వాష్ చేయిస్తున్నారు. అందుకే ఈ వ్యాపారానికి డిమాండ్ కూడా విపరీతంగా ఉంది.

అయితే మీరు స్థాపించే కార్ వాష్ లొకేషన్ అనేది కస్టమర్స్ సులువుగా కనుగొనే విధంగా ఉండాలి. అలాగే బేసిక్ కార్ వాష్ లతో పాటు ఇతర సేవలను అందించడం వలన కస్టమర్ల సంఖ్య కూడా గణనీయంగా పెంచుకోవచ్చు. అందుబాటు ధరల్లో మంచి సేవలను అందిస్తూ ఈ వ్యాపారంలో చాలా సులువుగా సక్సెస్ అందుకోవచ్చు.
ఫ్లవర్ బిజినెస్...
ప్రస్తుత కాలంలో బర్త్ డే పార్టీల నుండి వెడ్డింగ్ అనివర్సరీ , ప్రారంభోత్సవాలు , అంతక్రియల వరకు అనేక సందర్భాలలో పూలను విరివిగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి మన భారతదేశంలో పూల వ్యాపారానికి మంచి డిమాండ్ ఉందని చెప్పాలి.

ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారు ఒక లక్ష రూపాయలతో దీనిని ప్రారంభించవచ్చు. అంతేకాక పూలలో కొన్ని ఐదు రోజులు పాటు నిల్వ ఉండేవి కూడా ఉంటాయి. ఇలాంటి వాటిని బుకే ల రూపంలో ఇస్తుంటారు. ఈ విధంగా ఈ వ్యాపారం నుంచి కూడా మంచి లాభాలను పొందవచ్చు.
హోమ్ గార్డెనింగ్...
ప్రస్తుత కాలంలో హోమ్ గార్డెనింగ్ బిజినెస్ విస్తృతంగా ప్రారంభిస్తున్నారు. ఇంట్లోనే మొక్కలను పెంచి వాటిని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా విక్రయిస్తూ చాలామంది లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే మీరు ఈ బిజినెస్ ని చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు.

మొదట చిన్న స్థాయిలో లాభాలను పొందినప్పటికీ తర్వాత అధిక మొత్తంలో లాభాలను ఆర్జించవచ్చు. అంతేకాదు మీరు పెంచే మొక్కలను వీడియోలు తీస్తూ యూట్యూబ్ లో పోస్ట్ చేయడం ద్వారా కూడా మనీ సంపాదించవచ్చు. అలాగే మీ బిజినెస్ కు పబ్లిసిటీ కూడా వస్తుంది.
మొబైల్ రిపేర్....
నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతులు స్మార్ట్ ఫోన్ ఉండటం సహజంగా మారింది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్నారు.

అయితే ఉపయోగిస్తున్న క్రమంలో రిపేర్స్ రావడం అనేది చాలా సహజం. కావున మీరు ముందుగా దీనికి సంబంధించిన వర్క్ నేర్చుకొని మొబైల్ వర్క్ షాప్ ప్రారంభించినట్లయితే మంచి లాభాలను పొందవచ్చు. మీరు ఈ వ్యాపారాన్ని సిటీ లేదా గ్రామాల్లో కూడా మొదలు పెట్టవచ్చు.
