Ambani and adani deal : అంబానీ - అదానీ సంస్థల మధ్య కుదిరిన ఆసక్తికరమైన డీల్... విద్యుత్ ప్రాజెక్టులో 26%..

Ambani and adani deal : అంబానీ - అదానీ సంస్థల మధ్య కుదిరిన ఆసక్తికరమైన డీల్... విద్యుత్ ప్రాజెక్టులో 26%..

Ambani and adani deal : గుజరాత్ కు చెందిన రెండు ప్రముఖ కంపెనీల మధ్య కనిపించని పోటీ జరుగుతుందని బిజినెస్ వర్గాలలో తరచూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఆ వార్తలకు భిన్నంగా రెండు వ్యాపార దిగ్గజాలు చేతులు కలిపాయి అని తెలుస్తోంది.

దేశీయ కార్పొరేట్ రంగంలో ఆసక్తికరంగా మారిన ఈ డీల్ ముందు రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనే వాదనలు కూడా మెండుగా వినిపిస్తున్నాయి. మరి ఆ రెండు దిగ్గజ కంపెనీలు ఏంటి..? ఆ రెండు కంపెనీలు ఏ బిజినెస్ లో చేతులు కలిపాయి అనే విషయానికొస్తే...గౌతమ్ అదానికి చెందిన విద్యుత్ ప్రాజెక్టులో ముఖేష్ అంబానీ సారధ్యంలో ఉన్న రిలయన్స్ సంస్థ దాదాపు 20% వాటాను కొలుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

దేశీయ కార్పొరేట్ రంగంలో తొలిసారి ఈ ఇద్దరు చేతులు కలిపి చేసుకున్న ఒప్పందం కావడంతో ప్రస్తుతం ఇది హార్ట్ టాపిక్ గా మారింది. అయితే మధ్యప్రదేశ్ లోని ఓ ప్లాంట్ కు చెందిన 500 మెగావాట్ల యూనిట్ తో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను రిలయన్స్ సంస్థ తన సొంత అవసరాలకు వినియోగించుకునేలా ఈ రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈ క్రమంలోనే అదానికి చెందిన పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ 26% వాటాలను కొనుగోలు చేయడం జరిగింది. దీనికోసం అదాని పవర్ సంస్థ కు పూర్తి అనుబంధ సంస్థ అయిన మహాన్ ఎనర్జీ లిమిటెడ్ లో అంబానీ రిలయన్స్ సంస్థ 5 కోట్ల ఈక్విటీ షేర్ లను సొంతం చేసుకుంది.

అయితే దీనిలో ఆసక్తికర విషయం ఏంటంటే రూ.10 విలువకే 5 కోట్ల షేర్లను కొనుగోలు చేయడం జరిగింది. అంటే 500 మెగావాట్ల విద్యుత్ ను రిలయన్స్ కంపెనీ తన అవసరాలకు వాడుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఎంఈఎల్ ప్లాంట్ లో 2800 మెగావాట్ల థర్మల్  విద్యుత్ సామర్ధ్యంతో ఏర్పాటు అవుతోంది. కాగా దీనిలో  దాదాపు 600 మెగా వాట్ల యూనిట్ ను రిలయన్స్ సంస్థ తన సొంత అవసరాల కోసం వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది.

2901 -2
అయితే అంబానీ అదానీల మధ్య వ్యాపార పోటీ ఉందన్న వార్తలు ఎప్పటినుంచో వినిపించినప్పటికీ దానికి సంబంధించిన అధారాలు మాత్రం ఇప్పటివరకు లభించలేదు. అంతేకాదు ఈ రెండు దిగ్గజ కంపెనీలు ఒకే వ్యాపార రంగంలో పోటీ పడుతున్న సందర్భాలు కూడా లేవు. వీరిద్దరూ కూడా ఒకే ఒక స్వచ్ఛ ఇందన వ్యాపారం మినహాయించి  మరి ఎక్కడ కూడా ఒకేలాంటి వ్యాపారాలు ఇప్పటివరకు చేయలేదు.

చమురు గ్యాస్ మరియు టెలికం వంటి సంస్థలు అంబానీ వ్యాపారాలు అయితే...బొగ్గు తవ్వకం నుండి ఎయిర్ పోర్ట్ ల వరకు  అదాని వ్యాపారాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే ఒక సందర్భంలో వీరిద్దరి మధ్య వ్యాపార పోరు కొనసాగుతుందా అన్న చర్చలు 5జి స్పెక్ట్రమ్ కొనుగోలు సమయంలో చోటు చేసుకున్నప్పటికీ వాటికి త్వరగానే పులిస్టాప్ పడింది.

ఎందుకంటే అదానీ గ్రూప్స్ దరఖాస్తు చేసుకున్న 5జీ స్పెక్ట్రమ్ పబ్లిక్ నెట్వర్ కు కోసం కాదని ఆ సమయంలో వెళ్లడైంది. ఇది ఇలా ఉండగా 2022లో అంబానీ తో సంబంధం ఉన్న ఎన్డీజీలో తనకున్న వాటాలని అదానికి అమ్మేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన చిన్న కొడుకు పెళ్లికి అదాని కూడా హాజరయ్యారు. ఇంతలోనే ఈ ఆసక్తిక డీల్ తెరపైకి వచ్చింది. దీంతో ప్రస్తుతం కార్పొరేట్ వర్గాలలో ఈ న్యూస్ తీవ్ర చర్చానియాంశంగా మారింది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?