Twitter - X : ఎక్స్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక నుంచి పోస్టులకు లైక్ చేయాలన్నా డబ్బులు కట్టాల్సిందే..
పేరు మార్పు దగ్గర్నుంచి.. యూజర్లకు ఇప్పటి వరకు భారీ షాకులు ఇచ్చిన మస్క్.. తాజాగా కొత్త యూజర్లకు మరో షాక్ ఇచ్చాడు. కొత్తగా ఎక్స్ లో చేరే యూజర్లకు కనీసం పోస్టులకు లైక్ చేయాలన్నా.. పోస్ట్ పెట్టాలన్నా.. ట్వీట్స్ కు రిప్లయి ఇవ్వాలన్నా డబ్బులు కట్టాల్సిందే అని ప్రకటించాడు.
ఇప్పటికే ఈ పాలసీని ఎక్స్ కొన్ని దేశాల్లో తీసుకొచ్చింది. న్యూజిలాండ్, ఫిలిప్పిన్స్ దేశాల్లో ఈ పాలసీ యాక్టివ్ లో ఉంది. అయితే.. ఎక్స్ లో స్పామ్ ను తగ్గించేందుకు యూజర్ అనుభవాన్ని పెంచేందుకే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు ఎక్స్ తెలిపింది.
ట్విట్టర్ లో జెన్యూన్ అకౌంట్ల కంటే కూడా ఫేక్ అకౌంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్పామ్ కంటెంట్ కూడా పెరుగుతోంది. స్పామ్ బాట్స్, ఫేక్ అకౌంట్స్ ను కట్టడి చేసేందుకే ఎక్స్ నుంచి ఈ కొత్త పాలసీ వస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే ఇప్పటికే ఎక్స్ లో చేరిన యూజర్లకు కాకుండా.. కొత్తగా ఎక్స్ లోకి రాబోయే యూజర్లకు పోస్ట్ చేయాలన్నా, పోస్టులకు లైక్ చేయాలన్నా, రిప్లయి ఇవ్వాలన్నా, ట్వీట్స్ కు బుక్ మార్క్ చేయాలన్నా కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

సంవత్సరానికి కొంత నామినల్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. న్యూజిలాండ్, ఫిలిప్పిన్స్ లో ఈ పాలసీని ఎక్స్ టెస్ట్ చేసింది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ పాలసీని తీసుకొచ్చేందుకు ఎక్స్ ప్రయత్నాలు చేస్తోంది. దీని వల్ల కొత్తగా ఎక్స్ లోకి రాబోయే యూజర్లకు షాక్ అనే చెప్పుకోవాలి.
ప్రస్తుతం ఏఐ.. టెక్నాలజీ రంగాన్ని శాసిస్తోంది. ఏఐతోనే అన్ని పనులు సాగుతున్నాయి. సోషల్ మీడియా నెట్ వర్క్స్ ను కూడా ఏఐ శాసిస్తోంది. అందుకే ఏఐ స్పామ్ బాట్స్ నుంచి ఎక్స్ ను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. స్పామ్ బాట్స్ ను నివారించేందుకు చార్జ్ చేస్తామని ఎక్స్ ప్రకటించింది కానీ.. ఎక్స్ ఎన్ని ప్లాన్స్ ను తీసుకొస్తోంది అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు.
ప్రస్తుతం ఎక్స్ ప్లాట్ ఫామ్ లో పోస్టులు చేయడానికి, లైక్స్, కామెంట్స్ చేయడానికి ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదు. నార్మల్ యూజర్లకు ఉచితంగానే ఇవన్నీ అందిస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో 1.75 న్యూజిలాండ్ డాలర్లను వసూలు చేస్తున్నారు. అంటే.. ఇతర దేశాల్లో సగటున ఒక డాలర్ చొప్పున వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత అయిన ఎలాన్ మస్క్.. ఎక్స్ పై పూర్తి స్థాయి దృష్టి పెట్టినట్టు అర్థం అవుతోంది. ఎక్స్ సోషల్ మీడియా నెట్ వర్క్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ గా తీర్చిదిద్దేందుకు ఆయన ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.
ఇప్పటికే ప్రీమియమ్ ఆప్షన్ ను తీసుకొచ్చిన ఎక్స్.. బ్లూ టిక్ కోసం సంవత్సరానికి కొంత డబ్బు పే చేస్తే ప్రీమియమ్ ఆప్షన్ ద్వారా బ్లూ టిక్ లభిస్తుంది. ఎక్స్ కు చెందిన పలు అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కావాలన్నా ఎక్స్ ప్రీమియంలో చేరాలి. ట్వీట్ క్యారెక్టర్ లిమిట్ పెంచుకోవాలన్నా, కొన్ని ఇతర అడ్వాన్స్ ఫీచర్స్ కోసం చాలామంది ఎక్స్ ప్రీమియం ఆప్షన్ ను వినియోగిస్తున్నారు.
