Chocolate Business : తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు.. ఈ చాక్లెట్ బిజినెస్ చాలా తేలిక సుమీ..
అయితే మీరు కూడా చిన్న మొత్తంలో వ్యాపారాన్ని ప్రారంభించి అధిక మొత్తంలో లాభాలు పొందాలని చూస్తున్నారా.. అలాంటి బిజినెస్ ని ఇప్పుడు మీకోసం తీసుకొచ్చాం. ఇక ఈ బిజినెస్ ని మీరు ఆచితూచి జాగ్రత్తగా చేసుకుంటే ఎన్నేళ్లయినా సరే వ్యాపారం నడుస్తూనే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వ్యాపారం ఏంటి దానికి సంబంధించిన వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనం కూడా అలాంటి చాక్లెట్లను తింటూ పెరిగిన వాళ్ళమే. బ్రాండెడ్ కాదన్నంత మాత్రాన అవి మంచివి కాదు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఎప్పుడు కూడా వాటి వలన హాని జరిగింది లేదు. ఈ అవకాశాన్ని మీరు బిజినెస్ గా మలుచుకుంటే మంచి లాభాలను గడించవచ్చు.
ప్రస్తుత కాలంలో చాలా మంది హోమ్ మేడ్ చాక్లెట్లను తయారుచేసి మార్కెట్లో అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. మీరు కూడా తక్కువ పెట్టుబడితో బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటే ఇది చక్కటి ఉపాయం.
హోమ్ మేడ్ చాక్లెట్స్..
చాక్లెట్స్ అనేవి ఒత్తిడిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. అందుకే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చాలామంది చాక్లెట్లను తింటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇండియాలో ప్రతి ఏడాది చాక్లెట్ల వ్యాపారం 10 నుంచి 13 % దాకా పెరుగుతూ పోతుంది. అంతేకాక ఈ మధ్యకాలంలో ప్రపంచ నలుమూలల నుండి కూడా వివిధ రకాల చాక్లెట్లు ఇండియాకి వస్తున్నాయి.
ఇలాంటి చాక్లెట్లను బాగా డబ్బున్న వారు మాత్రమే కొనుక్కుంటారు. మరీ ముఖ్యంగా కోకోతో తయారయ్యే చాక్లెట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతేకాక వీటిని సంపన్నులు కూడాఎక్కువగా కోరుకుంటున్నారు. కావున మీరు కోకో చాక్లెట్లను తయారు చేసి మార్కెట్లో అమ్మవచ్చు.

దీనికోసం ముందుగా మీరు ఏం చేయాలో ఎలాంటి చాక్లెట్లను తయారు చేయాలో తెలుసుకోవాలి. అలాగే ఈ చాక్లెట్లను మీ ఇంట్లోనే తయారు చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. అయితే ఈ చాక్లెట్లు తయారీకి తక్కువ పెట్టుబడి అంటే దాదాపు 40 వేల నుండి 50 వేల మధ్య పెట్టుబడితో సాదాసీదా చాక్లెట్లు తయారుచేసి మార్కెట్ లో విక్రయించవచ్చు.
ఇక ఈ డబ్బుతో చాక్లెట్స్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్స్ అలాగే ప్యాకేజింగ్ కవర్స్ కొనాల్సి ఉంటుంది. అదే మీరు దీనిని ఎక్కువ మొత్తంలో చేయాలి అనుకుంటే భారీ సంఖ్యలో యంత్రాలు కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది కాబట్టి దాదాపు 3 లక్షల దాకా ఖర్చవుతుంది.
ఇక ఈ చాక్లెట్ తయారీలో ప్రధానంగా ఉపయోగించేవి పాలు ,చక్కెర ,ఫ్రూట్స్. అలాగే వీటన్నింటినీ మిక్సింగ్ చేసే యంత్రం మరియు పదార్థాలను చల్లపరచడానికి కూడా ఒక యంత్రం కావాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత రేపర్స్ లో చాక్లెట్లను చుట్టవచ్చు. అంతేకాక ఈ చాక్లేట్స్ వెంటనే పాడు కావు కాబట్టి వ్యాపారంలో నష్టాలు కూడా చాలా తక్కువ.
దీర్ఘకాలం వ్యాపారం...
చాక్లెట్ల వ్యాపారాన్ని దీర్ఘకాలం చేయాలి అనుకునేవారు సాదాసీదా చాక్లెట్లు తయారీ కాకుండా కోకో పదార్థాలతో డార్క్ చాక్లెట్లను తయారు చేయడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు. ఎందుకంటే భారతదేశంలో కోకో చాక్లెట్ల తయారీకి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది.

అంతేకాక క్వాలిటీ మైంటైన్ చేస్తూ మంచి టేస్ట్ ఉండే చాక్లెట్లు తయారు చేయడం వలన కస్టమర్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. కావున ఈ బిజినెస్ ఒక్కసారి క్లిక్ అయితే ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూడాల్సిన పని ఉండదు. అంతెందుకు ఇప్పుడు మనం చూస్తున్న అమూల్, క్యాడ్బరీ వంటి కంపెనీలు కూడా ఒకప్పుడు చిన్న తరహాలో తయారు చేసినవే.
వ్యాపారం ఎలా పెంచుకోవాలి..
అయితే మీరు మీ యొక్కచాక్లెట్లు వ్యాపారాన్ని విస్తరింపచేయాలి అంటే కచ్చితంగా మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు మీ చాక్లెట్లతో పాటు ఫ్రీగా కొన్ని టీ బిస్కేట్ లేదా పేస్ట్ వంటివి ఇవ్వడం వలన ప్రజలలో మీ చాక్లెట్ల ఆదరణ పెరుగుతుంది. ఈ విధంగా అతి తక్కువ సమయంలో మీ వ్యాపారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళవచ్చు.
అలాగే మీ చాక్లెట్లను యాడ్స్ రూపంలో చూపిస్తే...అవి అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీ వ్యాపారాన్ని విస్తరింప చేసుకోవచ్చు. అలాగే స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు ఉన్నచోట మీ చాక్లెట్లను ఎక్కువగా అమ్మినట్లయితే మరింత లాభం ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు చాక్లెట్ ను ఎక్కువగా తింటుంటారు.
వారికి ఒక్కసారి మీ చాక్లెట్ నచ్చిందంటే ఎప్పుడు తింటూనే ఉంటారు. కాబట్టి మొదట మీ చాక్లెట్ల మార్కెటింగ్ స్కూల్స్ ,కాలేజీ దగ్గర ప్రారంభించండి. గమనిక : వ్యాపారం లో నష్టాలు కచ్చితంగా ఉంటాయి. వాటిని మీ సొంత నిర్ణయాల ద్వారానే అధిగమించవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలకు క్విక్ టుడే ఎలాంటి బాధ్యత వహించదు.
