Fixed Deposit : మీరు పిల్లల పేరిట మనీ డిపాజిట్ చేస్తున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు...
పెట్టుబడికి రక్షణ రాబడికి హామీ ఉన్న పథకాలలో ఫిక్స్డ్ డిపాజిట్లు ముందు వరుసలో ఉంటాయి. ఇతర అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకునే తల్లిదండ్రులు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీటిలో మనీ డిపాజిట్ చేయడం వలన పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చు..
ఏటా కొంతమంది చేసేలా ఉండాలి. పిల్లల ఆర్థిక అవసరాలకు తగినట్టుగా మెచ్యూరిటీ వ్యవధులను ఎంచుకోవాలి. దీని వలన అనుకున్న సమయంలో డబ్బులు చేతికి అందుతాయి. లేకపోతే ఇబ్బందులు పడవలసి ఉంటుంది. ఇంకోవైపు మరో ఒకే టెన్యూర్ పై పెద్ద మొత్తంలో ఎఫ్డిడి చేయడం వలన కూడా చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది.
అందుకే ఎఫ్డి లాడర్ పద్ధతి వినియోగించడం చాలా మంచిది. అధిక వడ్డీ అందించే తక్కువ టెన్యూర్ కలిగిన పథకాలను మాత్రమే నిర్ణయించుకోవాలి. ఏడాదికి రెండేళ్లుకి మూడేళ్లు ఇలా వివిధ టెన్యూర్లా పిక్స్డ్ డిపాజిట్ చేయడం వలన లిక్విడిటీ పెరుగుతుంది. అంటే మీ చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉంటూనే ఉంటాయి.
మీ అవసరాలకు వాడుకొని మళ్ళీ వాటిని పిక్స్ డిపాజిట్ చేసేందుకు వీలుగా ఉంటుంది. తెలివిగా బ్యాంకులో మనీ డిపాజిట్ చేయడం వలన అదనపు ప్రయోజనాలను పొందుతారు..పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు పిక్స్ డిపాజిట్లు చేయడం మొదలు పెడితే చాలా మంచిది. దీని వలన ఎక్కువ కాలంలో చక్రవడ్డీ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.
అయితే మీరు చేసే డిపాజిట్లను క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలి. వడ్డీ రేటు పెరిగినప్పుడు పాత డిపాజిట్లను రద్దుచేసి కొత్త వడ్డీ రేట్లు చేస్తూ ఉండాలి. ఇలా ఎక్కువ వడ్డీ ప్రయోజనం పొందవచ్చు.. ఇంకోవైపు పిక్స్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీకి టాక్స్ వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని తగిన ప్రణాళికలను చేసుకోవాలి.