Petrol : గుడ్ న్యూస్.. పెట్రోల్,డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు...
పెట్రోల్, డీజిల్ ధర పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా చేస్తు కేంద్రం దిగొచ్చేంత వరకు పోరాటం ఆగదు అంటున్న ఉత్తమ్.వంట గ్యాస్ ధర తగ్గిన నైపద్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుముఖం పట్టెచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మంచి శుభవార్త తెచ్చింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత డీజిల్, పెట్రోల్ ధరలు ఉపశమనం కలిగించింది.

డీజిల్,పెట్రోల్ ధరలు లీటర్ రూ.2 చొప్పున తగ్గించటం వల్ల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోట్లా మంది భారతీయుల కుటుంబ సంక్షేమం తన లక్ష్యం అని నిరూపించాడు. దేశవ్యాప్తంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించినట్లు ప్రకటించింది.అయితే కొత్త ధరలు మార్చి 15, 2024 ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంతో ప్రధాన నగరంలో రేట్లు ఏ విధంగా ఉండేవో ముందు తెలుసుకుందాం.హైదరాబాద్ మహానగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.2.25 తగ్గించగా రూ.107.41 దిగి వచ్చింది. హైదరాబాదులో లీటర్ డీజిల్ ధర రూ.2.27 తగ్గించగా రూ.95.65కు వచ్చింది.మరొక నగరం వరంగల్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.99 తగ్గింది.వరంగల్లో లీటర్ డీజిల్ ధర రూ.95.25 దిగి వచ్చింది. కరీంనగర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.22 కు తగ్గింది.
ఒక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.2.45 తగ్గి 109.31 కుచేరింది. ఈ నగరంలో లీటర్ డీజిల్ ధర రూ.2.34కు తగ్గిరూ.97.17 కు చేరింది. వైజాగ్ లో పెట్రోల్ పై లీటర్ కు రూ.2.29 తగ్గగా ప్రస్తుతం108.29కు దిగి వచ్చింది. లీటర్ డీజిల్ ధర రూ.2.29కు తగ్గి ప్రస్తుతం96.17కు దిగి వచ్చింది. అయితే తగ్గించిన ఇందన ధరలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ధరల తగ్గింపు ఎన్నికల కోసమే అని విమర్శిస్తున్నాయి. ఈరోజు అనగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్,డీజిల్ ధరలను ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం తగ్గించింది..
