sell your old car : పాత కారు అమ్మేయాలనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ పాటిస్తే ఎక్కువ లాభం పొందుతారు.
ఇప్పుడు పాత కారు కొనుక్కోవాలా లేక కాస్త వెయిట్ చేసి కొత్త కారు కొనాలా అనే అయోమయంలో ఉంటారు.ఈ రోజుల్లో సామాన్యులు సైతం కార్లను కొనుగోలు చేస్తున్నారు. పాత కార్ల పై రుణం తీసుకొని కూడా కొనుగోలు చేస్తున్నారు. కొత్త కార్లు కొనేముందు పాత కారు అమ్మటం చాలా కష్టం. కారు సేలింగ్ ప్రాసెస్ ప్రారంభం కావటానికి ముందు వెహికల్ ను ప్రాపర్ గా ప్రిపేర్ చేయాలి. పాత కారును అమ్మకానికి పెట్టేవారు వెహికల్ మంచి ధరకే పలికేలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

కారును ప్రతినిత్యం సర్వీసింగ్ చేయించడం వలన వెహికల్ హెల్త్ రీసెల్ వాల్యూ ను పెంచుతుంది.రొటీన్ మెయింటెనెన్స్ లో భాగంగా ఆయిల్ చేంజ్,ఫ్లూయిడ్ రిపిల్స్, టైర్ రొటేషన్,బ్రేక్ రీప్లేస్ మెంట్ చేయాలి.ఈ పనులు చేయటం వలన కారు మంచి కండిషన్లో ఉంటుంది.అంతేకాక రిసెల్ వ్యాల్యూ ను కూడా పెంచుతుంది.కారు ఆప్టిమల్ కండిషన్ మెయింటెన్ చేయటానికి, రీసెల్ వాల్యూ పెంచడానికి, కారుకు ప్రతినిత్యం సర్వీసింగ్ చేయించడంతోపాటు సర్వీస్ హిస్టరీ రికార్డులను మెయింటైన్ చేయాలి. ఇది సెల్లింగ్ ప్రాసెసింగ్ సులభం చేస్తుంది.
అంతేకాక కొనుగోలు చేసే వారికి విలువైన డాక్యుమెంటేషన్ ని కూడా అందిస్తుంది.అదనంగా టైటిల్ పేపర్లు,రసీదులు,సంబంధిత పేపర్ వర్క్ వంటివి ముఖ్యమైన డాక్యుమెంట్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కారులో బ్లూటూత్,ఆడియో స్ట్రీమింగ్, రియల్ వ్యూ కెమెరా లేక నావిగేషన్ తో కూడిన టచ్ స్క్రీన్,ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం వంటి అడిషనల్ పిచర్లను కారుకి యాడ్ చేయాలి. ఇలాంటివి కొనుగోలు చేసే వారిని ఎక్కువగా ఆకర్షిస్తాయి.
కారు ను విక్రయించే ముందు ఇలాంటి ఫీచర్లు అప్ గ్రేడ్ చేస్తే ఎక్కువ ధరకు విక్రయిస్తారు. కొనుగోలు చేసేవారు కారు కొనే ముందు ఎక్స్ టర్నల్ లుక్, ఇంటీరియర్ రెండింటిని చాలా క్షుణంగా తనకి చేస్తారు. పాత కారు విక్రయించే ముందు క్యాబిన్ ని చాలా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కార్పెట్లు,మ్యాట్లు, సీట్ కవర్లు ప్రతినిత్యం శుభ్రం చేయాలి. మంచి సువాసన వచ్చేలా చేయాలి. వాక్యూమింగ్ అసభ్యకరమైన వాసనలను, మురికి చెత్తను తొలగిస్తుంది. క్యాబిన్ ఎయిర్ ప్రేసనర్స్ ఉపయోగించాలి..
