RBI అలర్ట్.. క్రెడిట్ కార్డు వినియోగదారులు వెంటనే ఇలా చేయక తప్పదు..
ప్రస్తుత కాలంలో చాలామంది ఉద్యోగులు ఈ క్రెడిట్ కార్డ్ ని ఉపయోగిస్తున్నారు. ఈ సమయంలోనే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని చర్యలను తీసుకుంటుంది. 2022 ఏప్రిల్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్,క్రెడిట్ కార్డ్ లకు సంబంధించిన కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.ఈ నిబంధనల ప్రకారం కార్డ్ హోల్డర్ తమ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ ను మార్చుకోవటానికి బ్యాంక్ ఒకసారి అనుమతి ఇవ్వాలి.

ఇది రెండు వరసల స్టేట్ మెంట్ తేదీల మధ్య టైం స్టేట్ మెంట్ నెలకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ బిల్లు.ఇది సాధారణంగా ప్రతి ఒక్క నెలకు జనరేట్ అయ్యే తేదీ. స్టేట్ మెంట్ జనరేట్ అయిన తరువాత బిల్లు కట్టటానికి సుమారు 10,15 రోజులు టైం పడుతుంది.అనగా 30 రోజుల బిల్డింగ్ సైకిల్, గడువు తేదీ వరకు ఉన్న 10,15 రోజులు కలిసి మొత్తం 45 రోజులు ఇంట్రెస్ట్ ఫ్రీ పిరియడ్ మీరు పొందవచ్చు. గడువు తేదీ ముగిసిన తర్వాత కూడా మీరు చెల్లించినట్లయితే మొత్తం వడ్డీతో సహా పడుతుంది. ఇంకా
బిల్డింగ్ సైకిల్ మార్చటానికి ఆప్షన్ ఉండటం వల్ల క్యాష్ ఫ్లోతో సులువుగా ఆన్ లైన్ చెయ్యవచ్చు. ఉదాహరణకు ప్రతి నెల1తేదీ లేక 10 తేదీల మధ్య ఖర్చు ఎక్కువ చేసినట్లయితే 25వ తేదీ తర్వాత స్టేట్ మెంట్ తేదీ సెట్ చేయటం వల్ల గడువు తేదీ వచ్చే నెల 10,15 తేదీల మధ్య వస్తుంది..
ఇది ఎక్కువ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ మీకు అందిస్తుంది. స్టేట్ మెంట్ తేదీ 10వ తారీకు అయినట్లయితే మీకు తక్కువ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది. మల్టిపుల్ క్రెడిట్ కార్డుల ప్రయోజనాలు ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నవారు ఆయా కార్డులో స్టేట్ మెంట్ గడువు తేదీలను మేనేజ్ చేయటం చాలా కష్టం.అన్ని బిల్లింగ్ సైకిల్స్ ఒక్క రోజే ముగిసేలా సెట్ చేసినట్లయితే ట్రాకింగ్ ఈజీగా ఉంటుంది. పేమెంట్స్ సులువుగా చేసుకోవచ్చు.
బిల్డింగ్ సైకిల్ ను మార్చుకోవటానికి కార్డ్ జారీ చేసిన కంపెనీ ఇమెయిల్ లేక ఫోన్ ద్వారా సంప్రదించాలి. బిల్లింగ్ సైకిల్ లో మార్పు చేయాలని రిక్వెస్ట్ చేసే ముందు ఏమైనా బకాయిలు,EMI లు క్లియర్ గా ఉన్నాయో లేవో చూసుకోవాలి.బకాయిలు ఉన్నవారు మొత్తం పేమెంట్ ని కట్టటం వలన లేట్ పేమెంట్ పెనాల్టీ ఉండదు.కానీ ఈ ఆప్షన్ చాలా ఖర్చుతో కూడుకున్న పని.ప్రస్తుతం బిల్డింగ్ సైకిల్ లో మిగిలిన అమౌంట్ పై గడువు ముగిసిన తర్వాత వెంటనే వడ్డీ మొదలవుతుంది.
కాబట్టి మొత్తం బకాయి ఉన్న బ్యాలెన్స్ క్లియర్ అయ్యేంతవరకు సైకిల్ లొని లావాదేవీలకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉండదు. లావాదేవీల పై వడ్డీ పెరగకుండా ఉండటానికి ప్రతి నెల గడువు ముందే బకాయి మొత్తం క్లియర్ చేసుకోవాలి అని ఆర్థిక నిపుణులు తెలియజేశారు..
