e bike: ఈ బైక్ కొనుగోలుదారుల‌కు కేంద్రం రూ.10వేల ప్రోత్సాహకం..

e bike: ఈ బైక్ కొనుగోలుదారుల‌కు కేంద్రం రూ.10వేల ప్రోత్సాహకం..

e bike: ప్ర‌స్తుతం ఇంధ‌నం ధ‌ర‌లు పెర‌గడంతోపాటు వాతావ‌ర‌ణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. విద్యుత్ వాహనాల త‌యారీ రంగాన్ని ప్రోత్స‌హిస్తోంది. ఇందుకోసం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కొనుగోలుదారుల‌కు స‌బ్బిడీ ఇచ్చి ప్రోత్స‌హిస్తోంది. ఇప్ప‌టికే ఫేమ్ -2 ప‌థ‌కం ద్వారా స‌బ్సిడీ అందిస్తుండ‌గా దీని గ‌డువు మార్చి 31తో ముగియ‌నుంది. కాగా మ‌రో కొత్త ప‌థ‌కానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వ‌ర‌కు ఈ కొత్త ప‌థ‌కం వ‌ర్తించ‌నుంది. ఈ కొత్త ప‌థ‌కం అమ‌లు కోసం భారీ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ రూ.500 కోట్ల‌తో కేటాయించింది. 

ఈ ప‌థ‌కం ప్ర‌కారం ఎల‌క్ట్రిక్ బైక్‌(e bike) కొనుగోలుకు రూ.10 వేల ఆర్థిక‌ ప్రోత్సాహం అంద‌జేయ‌నుంది. మొత్తం 3.3 ల‌క్ష‌ల ఎల‌క్ట్రిక్ ద్విచ‌క్ర వాహ‌నాల‌ను ఈ ప‌థ‌కం ద్వారా ఇవ్వ‌నుంది. అలాగే ఈ రిక్షా, ఈ కార్ట్ కొనుగోలు కోసం రూ.25 వేల ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. పెద్ద ఈ త్రీవీల‌ర్ వాహ‌నాల కొనుగోలు చేసేవారికి రూ.50 వేల ఆర్థిక ప్రోత్సాహ‌కం ఇవ్వ‌నుంది. ఇందుకోసం 41 వేల యూనిట్లను ఈ ప‌థ‌కం ద్వారా అంద‌జేయ‌నుంది.  

ఈ మొబిలిటీ (ఎలక్ట్రిక్ వాహనాలు) ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా ఈ మొబిలిటీ ప్రమోషన్స్ స్కీం 2024 తీసుకొచ్చినట్లు భారీ పరిశ్రమల మంత్రి మహేంద్ర నాథ్ పాండే మీడియాతో తెలిపారు. ఈ ప‌థ‌కం కోసం ఐఐటి రూర్కీతో కేంద్రం అవగాహన ఒప్పందం చేసుకున్న‌ట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు సహా రవాణా రంగం కోసం సెంటర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ ఇండస్ట్రీ యాక్స‌ల‌రేట‌ర్‌ను ఐఐటీ రూర్కీలో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఈ మొబిలిటీ రంగం మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంది.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?