అమెరికా ఖాతా నుంచి రూ.16 కోట్లు మేనేజ‌ర్ మాయం చేసిన‌ట్లు మ‌హిళ ఆరోపించింది.. అలా ఎలా జ‌రిగింది..?

అమెరికా ఖాతా నుంచి రూ.16 కోట్లు మేనేజ‌ర్ మాయం చేసిన‌ట్లు మ‌హిళ ఆరోపించింది.. అలా ఎలా జ‌రిగింది..?

దేశంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒక బ్యాంకు మేనేజర్ తన ఖాతా నుంచి 16 కోట్ల రూపాయలు అక్రమంగా మళ్ళించారని భారత్ కు చెందిన ఒక మహిళ ఆరోపించారు. అమెరికా ఖాతా నుంచి ఐసిఐసిఐ బ్యాంకుకు నగదు బదిలీ చేసినట్లు శ్వేత శర్మ చెప్పారు. అయితే  బ్యాంక్ అధికారొ ఒక‌రు త‌న ఖాతాలోని డ‌బ్బులు డ్రా చేసుకునేందుకు  న‌కిలీ అకౌంట్లు సృష్టించి ఫోర్జ‌రీ సంతకాలు త‌న పేరుతో డెబిట్ కార్టులు తీసున్న‌ట్లు ఆరోపించారు. అని బ్యాంకు రికార్డుల్లో తన ఫోన్ నెంబర్ను మార్చేసారని అందుకే నగదు విత్ డ్రా గురించి ఎలాంటి నోటిఫికేషన్లో తనకు రాలేదని అని బీబీసీతో చెప్పారు మోసం జరిగింది. నిజమే అని బ్యాంకు ప్రతినిధి బీబీసీతో అంగీకరించారు. అమెరికా హాంకాంగ్లలో దశాబ్దాల పాటు నివసించిన శర్మ ఆమె భర్త 2016లో భారత్కు తిరిగి వచ్చిన తర్వాత ఒక స్నేహితుని ద్వారా బ్యాంకర్ను కలిశారు. అమెరికాలో బ్యాంకు డిపాజిట్లపై చాలా తక్కువ వడ్డీ రేటు ఉంటుందని భారతలో అయితే ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.5% నుంచి 6% వరకు వడ్డీ వస్తుందని చెప్పి డబ్బులు ఇక్కడే బ్యాంకులో జమ చేయాలని ఆయన శ్వేతా శర్మకు సలహా ఇచ్చారు. 

ఆయన సలహా మేరకు ఢిల్లీకి సమీపంలోని పాత గురుకులంలోని ఐసిఐసిఐ బ్యాంకు ను సందర్శించిన ఆమె ప్రవాస భారతీయుల కింద ఎంఆర్ఈ అకౌంట్ తెరిచారు. 2019లో అమెరికా అకౌంటు నుంచి ఇక్కడికి నగదు బదిలీ చేయడం ప్రారంభమైంది. జీవిత కాలం పొదుపు చేసిన మొత్తం డబ్బు 13.5 కోట్ల రూపాయలను 2019 సెప్టెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు నాలుగేళ్ల వ్యవధిలో బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పారు. అది వడ్డీతో కలిపి 16 కోట్లకు పైగా చేరిందని  అన్నారు.  బ్యాంకులో కొత్త ఉద్యోగి మీ డబ్బుపై మంచి రాబడి వచ్చే అవకాశం ఉందని ఆమెకు సలహా ఇవ్వడంతో జనవరి మొద‌టివారంలో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. మిలియన్ రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ కూడా తీసుకున్నట్లు ఉంది. మొత్తం వ్యవహారాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని బ్యాంకు ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చించామని శ్వేతా శర్మ చెప్పారు. జనవరి 16న బ్యాంకు రీజినల్ జోనల్ హెడ్లతో పాటు ముంబై నుంచి వచ్చిన బ్యాంకు అంతర్గత విజిలెన్స్ ఉన్నతాధికారిని కలిసాం. దీంతో బ్యాంకు వైపు నుంచి జరిగిన పొర‌పాటుగా వారు చెప్పారు. బ్రాంచ్ మేనేజర్ మోసం చేస్తున్నట్లు వారు అంగీకరించారు అని ఆమె తెలిపారు. రెండు వారాల్లో సమస్యల పరిష్కరిస్తామని బ్యాంకు అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఆరువారాలకు పైగా గడిచిన ఇంకా తన అకౌంట్లో నగదు ఎప్పుడు జమ అవుతుందోనని వేచి చూస్తున్నట్లు శర్మ చెప్పారు. ఈలోగా ఆమె ఐసిఐసిఐ బ్యాంకు సీఈవో డిప్యూటీ సీఈఓ లకు లేఖలు రాశారు. 

అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో పాటు ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాలు విభాగానికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు పెండింగ్లో ఉండటంతో తొలత 9.27 కోట్లను తాత్కాలిక హక్కు కింద ఆమె అకౌంట్లో జమ చేయనున్నట్లు బీబీసీకి పంపిన ఒక పట్టణంలో బ్యాంకు వర్గాలు తెలిపాయి. అయితే బ్యాంకు ఆఫర్లు శర్మ తిరస్కరించారు. నాకు రావాల్సిన 16 కోట్ల కంటే ఇది చాలా తక్కువ తాత్కాలిక హక్కు అంటే పోలీసులు కేసు ముగించే వరకు ఆ అకౌంట్ లావాదేవీలు నిలిచిపోతాయి. ఇది తేలేందుకు కొన్నేళ్లు పట్టొచ్చు. ఏ తప్పు చేయకుండా నేనెందుకు శిక్ష అనుభవించాలి. నా జీవితం తలకిందులైంది. నిద్ర పట్టడం లేదు అన్ని పీడకలలో వస్తున్నాయి అని ఆమె అన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత బ్యాంకు మేనేజర్ ను బి బి సి సంప్రదించలేకపోయింది. ఇలాంటి కేసులు చాలా అరుదు అని ఈ విధమైన మోసాలు జరగకుండా బ్యాంకులో ఆడిట్లు తనకేలు చేస్తుంటాయని బ్యాంకింగ్ వ్యవహారాలను ఇష్టంగా పరిశీలించే ఫీన్క్ కంపెనీ కాస్ట్లీస్ కన్జ్యూమర్ కి చెందిన ఎల్ శ్రీకాంత్ అన్నారు. కానీ బ్యాంక్ మేనేజర్ మిమ్మల్ని మోసం చేయాలని నిర్ణయించుకుంటే మాత్రం దాదాపుగా మీరు ఏం చేయలేరని ఆయన అన్నారు. ఇలాంటి అవకతవకలకు సంబంధించిన విషయాలతో ఐసిఐసిఐ బ్యాంకు వార్తల్లో నిలవడం ఈ నెలలోనే ఇదే రెండోసారి.. బ్యాంకు టార్గెట్లను పూర్తిచేసేందుకు బ్రాంచ్ మేనేజర్ సిబ్బంది కలిసి డిపాజిటర్లకు చెందిన వందల కోట్ల రూపాయలను కొన్నేళ్లుగా ఇతర ఖాతాలకు మోసపూరితంగా మళ్ళిస్తున్నట్లు గుర్తించమని ఈ నెల మొదట్లో రాజస్థాన్ పోలీసులు తెలిపారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?