Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటి ముందు గన్‌తో కాల్పులు.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్.. అసలేం జరిగింది?

Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటి ముందు గన్‌తో కాల్పులు.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్.. అసలేం జరిగింది?

Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది. సల్మాన్ ఖాన్.. ముంబైలోని బాంద్రాలో ఉంటున్నాడు. బాంద్రాలో ఉన్న గెలాక్సీ అపార్ట్ మెంట్ లో సల్మాన్ ఖాన్ నివాసం ఉంటున్నాడు. ఆ అపార్ట్ మెంట్ ముందు ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. 

ఏప్రిల్ 14న తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులకు వెంటనే సమాచారం అందడంతో అక్కడికి చేరుకొని అసలు ఏం జరిగిందా అని ఆరా తీస్తున్నారు. వెంటనే క్రైం బ్రాంచ్, ఫోరెన్సిక్ అధికారులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

Salman Khan : సల్మాన్ ను టార్గెట్ చేసుకొని ఈ కాల్పులు జరిగాయా?

నిజానికి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చాలామందికి టార్గెట్ అయ్యాడు. ఇప్పటికే ఆయనకు చాలా బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. గత సంవత్సరం సల్మాన్ కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ముంబై పోలీసులు ఆ మెయిల్ పై విచారణ జరిపారు. లారెన్స్, గోల్డీ అనే గ్యాంగ్ స్టర్స్ ఈ బెదిరింపు మెయిల్స్ పంపినట్టుగా సమాచారం అందింది. 

143 -2

పోలీసుల దర్యాప్తులో తేలింది ఏంటంటే.. ఈ గ్యాంగ్ స్టర్స్ టార్గెట్ లిస్టులో సల్మాన్ పేరు ఉన్నట్టు నిర్ణయించారు. ఇలా చాలాసార్లు సల్మాన్ కు బెదిరింపు ఈమెయిల్స్ రావడం, సల్మాన్ ను టార్గెట్ చేయడంతో పోలీసుల సూచన మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ ఖాన్ కు వై ప్లస్ భద్రతను కల్పించింది. 

అంతకుముందు సల్మాన్ ఖాన్ కు ఎక్స్ గ్రేడ్ భద్రత ఉండేది. కానీ.. సల్మాన్ కు గ్యాంగ్ స్టర్స్ నుంచి ఎప్పుడైతే బెదిరింపు మెయిల్స్ వచ్చాయో.. అప్పటి నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేడ్ భద్రతను పెంచి వై ప్లస్ గా మార్చింది. 

ప్రస్తుతం ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది సల్మాన్ తోనే ఉంటారు. ఆయన ఇంటి ముందే 24 గంటలు కాపలా కాస్తుంటారు. ఇంత భద్రత ఉన్నా.. ఆయన ఇంటి ముందు ఇలాంటి కాల్పులు జరగడంతో మరోసారి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇది ఆ గ్యాంగ్ స్టర్స్ పనేనా? లేక వేరే వాళ్లు చేసిన పనా అని ఆరా తీస్తున్నారు. 

నిజానికి కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ దోషిగా తేలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ ను కొందరు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. అప్పటి నుంచి గ్యాంగ్ స్టర్స్ ఎక్కువగా సల్మాన్ ను టార్గెట్ చేసుకున్నారు. 

143 -1

గ్యాంగ్ స్టర్ లారెన్స్.. కూడా బహిరంగంగానే సల్మాన్ పై తన కోపాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సల్మాన్ ను ఈ గ్యాంగ్ స్టర్స్ టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. గత సంవత్సరం బెదిరింపు ఈమెయిల్స్ వచ్చిన తర్వాత నుంచి మళ్లీ సల్మాన్ కు ఎలాంటి బెదిరింపు మెయిల్స్ రాలేదు. 

సంవత్సరం తర్వాత మళ్లీ ఇలా తన ఇంటి ముందే కాల్పులు జరగడంతో సల్మాన్ అభిమానులు, బాలీవుడ్ పరిశ్రమ ఉలిక్కిపడింది. తమ అభిమాన నటుడికి ఏం కాకూడదని సల్మాన్ అభిమానులు కోరుతున్నారు. పోలీసులు.. ఈ కేసును చాలెంజింగ్ గా తీసుకొని కాల్పులకు పాల్పడిన వారిని పట్టుకొని దీని వెనుక ఎలాంటి కుట్ర ఉన్నా ఛేదించాలని కోరుతున్నారు. 

అయితే.. ఈ కాల్పుల ఘటనపై సల్మాన్ ఖాన్ మాత్రం స్పందించలేదు. పోలీసుల సమాచారం ప్రకారం మొత్తం మూడు రౌండ్ల కాల్పులు జరిగినట్టు గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున 4.55 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్టు పోలీసులు గుర్తించారు. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?