Relangi Narasimha Rao :  ఇండస్ట్రీలో మంచి పేరున్న వ్యక్తి.. కానీ అతడితో టైం వేస్ట్ '

-  డైరెక్టర్ రేలంగి నరసింహారావు సంచలన వ్యాఖ్యలు..! 

Relangi Narasimha Rao :  ఇండస్ట్రీలో మంచి పేరున్న వ్యక్తి.. కానీ అతడితో టైం వేస్ట్ '

 

Relangi Narasimha Rao :  తెలుగు పరిశ్రమలో డైరెక్టర్ గా రేలంగి నరసింహారావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇతరులను బాగా నవ్వించాలంటే ముందుగా మనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. కానీ ఆయన నవ్వకుండానే ఇతరులను నవ్వించడంలో దిట్ట. రేలంగి నరసింహారావు కు అది బాగా తెలిసిన కళ. గురువు దాసరి నారాయణ వద్ద అనేక సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసిన తర్వాత రేలంగి నరసింహారావు తెలుగు, కన్నడ భాషల్లో అనేక సినిమాలలో నవ్వులు పూయించారు. 70 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. రేలంగి నరసింహారావు దర్శకత్వంలో రూపొందిన మొదటి సినిమా ' చందమామ '. అది ముందుగా వెలుగు చూడలేదు. ఆ తర్వాత రేలంగి తనలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ కామెడీగా ట్రై చేశారు. అలా రూపొందిన సినిమా ' నేను మా ఆవిడ '. ఈ హాస్య భరిత సినిమా జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత రేలంగి దర్శకత్వంలో ఏవండోయ్ శ్రీమతి గారు, ఇల్లంతా సందడి కూడా నవ్వులు పూయించాయి. అప్పుడు మొదటి సినిమా చందమామ కూడా వెలుగు చూసింది. 

చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ అప్పట్లో కామెడీ హీరోలుగా కదం తొక్కుతున్నారు. దాంతో వారిద్దరితోను రేలంగి ఎడాపెడా సినిమాలు తీసేశారు. అన్నింట్లోనూ నవ్వులే పూసాయి. మరీ ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ 30కి పైగా సినిమాల చేశారు  . తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా సినిమాలను డైరెక్ట్ చేశారు. ఇక ఆయన సుమన్, రేవతి, కిన్నెరలను తెలుగు తెరకు పరిచయం చేశారు. హాస్య ప్రధాన సినిమాలను తీసే రేలంగి ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, సంసారం , సుందరి సుబ్బారావు, చిన్నోడు పెద్దోడు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ వంటి ఎన్నో హిట్ సినిమాలను తీశారు. ఇక రాజేంద్రప్రసాద్, రేలంగి కాంబినేషన్ లో వచ్చిన ' ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం ' సినిమా సూపర్ హిట్ అయింది. ఆ అనుభవాలను రేలంగి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జంధ్యాల గారి ఆహనా పెళ్ళంట సినిమా చూశాక ఒక పిసినారి పాత్ర నుండి కథలో హాస్యం పుట్టించి హిట్ కొట్టిన విధానం చూసి పిసినారి కాన్సెప్ట్ సినిమా తీయాలని రేలంగి డిసైడ్ అయ్యారట. 

కథ మొదట అనుకున్నాక రైటర్ దగ్గరికి వెళ్లి డెవలప్ చేయాలనుకున్న రేలంగికి ముందు సినిమా ప్రొడ్యూసర్ అయిన భాస్కర్ రెడ్డి మళ్ళీ సినిమా నిర్మిస్తానని చెప్పడంతో ఒక మంచి పేరున్న రైటర్ వద్దకు వెళితే హోటల్లో రూమ్ బుక్ చేయించుకొని మూడు నెలలు కథ గురించి చర్చలు వదిలేసి వేరే ఇతర విషయాలు గురించి మాట్లాడి టైం వృధా చేసేసారని అన్నారు. ప్రస్తుతం ఆయన మరణించారు. అందుకే పేరు చెప్పడం లేదంటూ రైటర్ పేరు చెప్పడానికి రేలంగి ఇష్టపడలేదు. ఇక చివరికి నిర్మాతను హేళనగా మాట్లాడడంతో నచ్చక ఆయనను వదిలించుకొని నేనే కథ పూర్తిగా సిద్ధం చేసి మరో ఇద్దరు రైటర్లు, నాకు తెలిసిన వాళ్లకు కథ వినిపించి వారంలో స్క్రిప్ట్ పూర్తి చేసి షూటింగ్ కి వెళ్ళానని ఆ సినిమా విశేషాలను రేలంగి పంచుకున్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?