Anasuya Campaign for Janasena : జనసేన పార్టీలో చేరబోతున్న అనసూయ? పార్టీ తరుపున ప్రచారం? ఇదంతా నిజమేనా?
తను ఎంతసేపు సినిమాల గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా హాలిడేస్ ట్రిప్ కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఫోటోలు, వీడియోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది యాంకర్ అనసూయ. దీంతో ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతాయి.
కానీ.. అసలు నేను ఎప్పుడు పార్టీలో చేరుతా అని ప్రకటించా. మీకు ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది రాసేస్తారా? నేను జనసేనకు సపోర్ట్ చేస్తా.. పార్టీకి ప్రచారం చేస్తా అని ఎప్పుడు చెప్పాను.. అంటూ అనసూయ కూడా క్లారిటీ ఇచ్చేసింది.
Anasuya Campaign for Janasena : జాఫర్ ఇంటర్వ్యూలో ఓపెన్ అయిన అనసూయ
ప్రముఖ జర్నలిస్టు జాఫర్ తెలుసు కదా. ఆయనకు ఇట్లు మీ జాఫర్ అనే యూట్యూబ్ చానెల్ ఉంది. ఆ యూట్యూబ్ చానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన అనసూయ.. రాజకీయాల గురించి మాట్లాడింది. పవన్ కళ్యాణ్ బెస్ట్ లీడర్ అంటూ పొడిగేసింది. ఒకవేళ ఆయన తనను ఆహ్వానిస్తే జనసేన పార్టీ తరుపున ప్రచారం కూడా చేస్తా అని చెప్పుకొచ్చింది అనసూయ.
జాఫర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పై వ్యాఖ్యలు చేసింది తప్పితే తనకు.. జనసేన పార్టీలో చేరాలని ఉందని.. తాను జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ తరుపున ప్రచారం చేస్తా అని అనసూయ చెప్పలేదు. కానీ.. నెటిజన్లు ఊరుకుంటారా? అనసూయ జనసేనలో చేరుతోంది? ఆ పార్టీ తరుపున ప్రచారం కూడా చేయబోతోంది.. అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు.
అవునా.. నిజమా.. అనసూయ జనసేనలో చేరుతోందా? అని ఏపీ రాజకీయాల్లో ఒక అలజడే స్టార్ట్ అయింది. తాజాగా తన కామెంట్స్ పై క్లారిటీ కూడా ఇచ్చేసింది అనసూయ. ఓ సెలూన్ షాప్ ఓపెనింగ్ సెరమనీకి వచ్చిన అనసూయ.. తాను జనసేన తరుపున ప్రచారం చేస్తా అని చెప్పలేదని స్పష్టం చేసింది.

నేను తుమ్మినా వివాదమే.. దగ్గినా వివాదమే. మీకు ఏం కావాలి. కాంట్రవర్సేగా. నన్ను ఓ ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి ప్రశ్న అడిగారు. దానికి నేను సమాధానం చెప్పాను. అంతే కానీ.. నాకు నేనుగా ముందుకు వచ్చి జనసేనకి సపోర్ట్ చేస్తా అని చెప్పానా? ఆయన మంచి లీడర్. ఆయన్ని ప్రోత్సహిస్తా. కానీ ఆ పార్టీ తరుపున ప్రచారం చేస్తా అని నేను చెప్పలేదు.
ఏ పార్టీకి అయినా వాళ్ల అజెండా ఉంటుంది. వేరే పార్టీలకు కూడా ఉంటాయి. నేను ఆ ఒక్క పార్టీ గురించే చెప్పలేదు. మామూలుగా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడాను. దాన్ని పట్టుకొని మీకు ఇష్టం ఉన్నట్టుగా రాసుకుంటున్నారు. దానికి నేను ఎలా రెస్పాన్సిబుల్ అవుతాను అంటూ మరోసారి అనసూయ కాస్త ఘాటుగానే స్పందించారు.
