ఎన్టీఆర్ సాయం వల్లే రజినీకాంత్ ఇంత పెద్ద స్టార్ హీరో అయ్యాడా ..

ఎన్టీఆర్ సాయం వల్లే రజినీకాంత్ ఇంత పెద్ద స్టార్ హీరో అయ్యాడా ..

తెలుగు పరిశ్రమలో దివంగత నటుడు నట విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు పేరు చిరస్థాయిగా నిలిచింది. ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేయగలిగే నైజం ఎన్టీఆర్ కి ఉంది. రాముడు, కృష్ణుడు, కర్ణుడుమ దుర్యోధనుడు ఇలా పౌరాణిక పాత్రలకు ఆయన సెట్ అయినట్లుగా ఇప్పటిదాకా ఎవరు అంతలా సెట్ కాలేదని చెప్పాలి. అంతలా తన పాత్రలో ఒదిగిపోయి నటించేవారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న పేరు ప్రతిష్టలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైటర్ గా నటుడిగా దర్శకుడిగా ఎన్నో సినిమాలు చేసిన ఆయన చివరికి రాజకీయాలలోకి కూడా అడుగు పెట్టారు. ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇక ఇండస్ట్రీలో ఆయన అందరితో సానిహిత్యంగా ఉండేవారట. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూడా సీనియర్ ఎన్టీఆర్ మంచిగా ఉండేవారట. తమిళ హీరో అయిన రజినీకాంత్ తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ గా ఎదిగి పలు భాషలలో సినిమాలు చేశారు. 

ఇక ఇప్పుడు రజినీకాంత్ యోగిగా మారిపోయారు. ఒకరకంగా చెప్పాలంటే సన్యాసిగా జీవితాన్ని గడుపుతున్నారని చెప్పాలి. దైవచింతన తప్ప మరొక ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు. ఆయన జీవితంలో సినిమాలు, ఆధ్యాత్మికత మాత్రమే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎత్తుకు ఎదగాలో అంతా చూసేశారు. ఇక చూడడానికి ఏమీ లేదని కేవలం మిగిలి ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా బ్రతకాలి అన్న ఒకే కారణంతో ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇదంతా కూడా ఆయన ఒక వయసుకు వచ్చిన తర్వాత నుంచి మొదలుపెట్టారు. కానీ కెరియర్లో మొదట్లో రజినీకాంత్ కు కాస్త స్టార్ డం వచ్చిన తర్వాత వ్యసనాలకు బానిస అయ్యారు. విపరీతమైన మద్యం తాగుతూ సిగరెట్లు కూడా త్రాగేవారు. ఆ మత్తులో ఎప్పుడూ ఉండేవారు. ఒక్కోసారి త్రాగి షూటింగ్ కి కూడా సరిగా వచ్చేవారు కాదు. ఎక్కడపడితే అక్కడ త్రాగేస్తూ షూటింగ్లకు రాకుండా ఉండేవారట. అందుకే కొన్ని సినిమాలు ఆయన పద్ధతి తట్టుకోలేక మధ్యలోనా ఆపేసేవారట. కొంతమంది అయితే షూటింగ్ మొదలయ్యాక కూడా మరొక హీరోతో మళ్ళీ సినిమా మొత్తం రీ షుట్ చేసుకునే వారట. 

అలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ తో పాటు రజినీకాంత్ టైగర్ అనే సినిమాలో మల్టీ స్టారర్ గా నటించారు. టైగర్ సినిమాని మల్టీస్టారర్ గా ఎన్టీఆర్ ని రజనీకాంత్ ని పెట్టి సినిమా తీశారు. అయితే ఎన్టీఆర్ తో సినిమా తీస్తున్న అన్న భయం కానీ పెద్దవారిని ఇబ్బంది పెట్టవద్దు అనే జ్ఞానం కూడా రజనీకాంత్ కి ఆ సమయంలో లేకపోయింది. యధావిధిగా తాగుతూ సరిగ్గా షూటింగ్ కి వచ్చేవారు కాదు. దీంతో రజినీకాంత్ పద్ధతి నచ్చక నిర్మాత, దర్శకుడు రజనీకాంత్ ని ఈ సినిమా నుంచి తీసేద్దామని ఎన్టీఆర్ కి సలహా ఇచ్చారట. కానీ ఆ మాటతో కోప్పడిన ఎన్టీఆర్ అతడు తాగుడుకు అలవాటు అయి ఉంటే ఎలాగోలా నచ్చచెప్పి షూటింగ్ కి తీసుకురండి. కోపం ఉన్న‌ట్ల‌యితే ఎలా తగ్గించాలో అర్థం అయ్యేలా చెప్పాలి. అంతేకానీ సినిమాలో నుంచి తీసేస్తే అతను భవిష్యత్తు ఏమవుతుంది. రజనీకాంత్ ఏదో ఒక రోజు పెద్ద స్టార్ అవుతారని ఎన్టీఆర్ అన్నారట. ఇక సినిమాలో రజినీకాంత్ ఉండేలా చూసుకున్నారట. తర్వాత ఈ విషయం తెలిసి రజనీకాంత్ చాలా సిగ్గు పడ్డారట. ఇక అప్పటినుంచి మద్యం మానేసి షూటింగ్లకు సరైన సమయానికి వచ్చేవారట. అలా ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?