Kurchi Madathapetti : ప్రపంచ స్థాయిలో మహేష్ "కుర్చీ - మడతపెట్టి" పాడేస్తున్న జనులు...
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ డైలాగ్స్ తో కొత్త లుక్ లో కనిపించగా ఇలలు గోళాలతో ఫాన్స్ థియేటర్స్ లో దుమ్మురేపారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా శ్రీ లీల నటించారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహించగా ఈ సినిమాలోని "కుర్చీ మడతపెట్టి" అనే సాంగ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రేండింగ్ గా మారింది.

ఆ ఒక్క మాట ఆ బిచ్చగాడిని కాస్త సెలబ్రిటీ ని కూడా చేసింది. దీంతో ఆ ఒక్క మాటను తీసుకుని తమన్ దానిపై ఒక పాటను రూపొందించి తీసుకురావడం చాలా గొప్ప విషయమే. ఆ బిచ్చగాడు ఆ ఒక్క మాటతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాపులర్ కాగా అతను చెప్పిన ఒక్క మాటను పాట రూపంలో తీసుకువచ్చి తమన్ అందర్నీ తెగ ఊపేసాడు.
ఇక ఈ పాటలో శ్రీ లీల మరియు మహేష్ బాబు చేసిన డాన్స్ కూడా రచ్చ లేపిందని చెప్పాలి. ఈ విధంగా మహేష్ బాబు డాన్స్ చేయడం మునిపెన్నడు మనం చూసి ఉండం. అంతేకాదు శ్రీలీల కు పోటీ ఇచ్చేందుకు మహేష్ బాబు అంతలా డాన్స్ చేసినట్లుగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ పాటలో మహేష్ బాబు తన ఊర మాస్ స్టెప్పులతో ప్రేక్షకులు ఆకట్టుకున్నాడు.

ఈ విధంగా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ పాట ప్రస్తుతం ప్రపంచ స్థాయికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ పాటకు చాలామంది సెలబ్రిటీలు కూడా స్టెప్పులేసి దానిని నెట్టింట షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ కూర్చి మడతపెట్టి అనే సాంగ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట తర్వాత అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న తెలుగు పాటలలో మహేష్ బాబు కూర్చి మడతపెట్టి సాంగ్ కూడా ఒకటి అని చెప్పాలి. ఈ విధంగా మన తెలుగు స్థాయి ప్రపంచ దేశాల్లో కూడా వినిపిస్తుందంటే నిజంగా గొప్ప విషయమే కదా.
