పెద్దనాన్న ముందే హీరోయిన్ తో ప్రభాస్ రొమాన్స్.. సడెన్ షాక్ ఇచ్చిన కృష్ణంరాజు..

పెద్దనాన్న ముందే హీరోయిన్ తో ప్రభాస్ రొమాన్స్.. సడెన్ షాక్ ఇచ్చిన కృష్ణంరాజు..

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చే మూవీ ' వర్షం '. ఇప్పుడు ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సబ్జెక్టులు తీసుకుంటు మూవీస్ చేస్తూ తన అభిమానులతో పాటు ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. అయినా కెరియర్ మొదట్లో వర్షం మూవీ చేయటంతో అది సూపర్ హిట్ అందించటం తో పాటు ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. తన కెరీర్ లో ఎన్నో మూవీస్ సక్సెస్ ని ఇచ్చిన వర్షం మూవీ మాత్రం ఆయన కెరీర్ లో మర్చిపోలేని సినిమా అనే చెప్పాలి. ఈ వర్షం మూవీ లో త్రిష, ప్రభాస్, గోపీచంద్ నటించారు. గోపీచంద్ హీరో అయినప్పటికీ విలన్ గా కూడా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రభాస్ తనకు దక్కిన ఫస్ట్ సక్సెస్ మూవీ ఇదే కావటం కూడా ఒక విశేషం.

 ఈ మూవీ షూటింగ్లో ఉండగా ప్రభాస్ కి ఒక సడన్ సర్ప్రైజ్ కలిగింది. అది ఏమిటి అనగా నిజం చెప్పాలంటే ప్రభాస్ కి సిగ్గు ఎక్కువగా ఉండేదట. అంతేకాక ప్రభాస్ కి వాళ్ళ పెద్దనాన్న ముందు యాక్టింగ్ చేయటానికి చాలా సిగ్గుపడేవాడంట.అందువల్ల కృష్ణంరాజు సెట్ లో ఉంటే ఆయన వెళ్లే దాకా వెయిట్ చేసి మరి తరువాత షూటింగ్ కంప్లీట్ చేసేవాడు. అందుకే కృష్ణంరాజు ప్రభాస్ మూవీస్ షూటింగ్ కి వచ్చేవాడు కాదు. ఇక ఒకరోజు వర్షం మూవీ షూటింగ్ సమయంలో సినిమా ప్రొడ్యూసర్ ఎం.ఎస్ రాజు కృష్ణంరాజుని షూటింగ్ దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆయన అక్కడికి వచ్చిన సంగతి ప్రభాస్ కి తెలియదు. అప్పుడే ప్రభాష్, త్రిష కి మధ్య ఒక రొమాంటిక్ సీన్ డైరెక్ట్ చేయిస్తున్నాడు.

 ఆ సీన్ అయిపోయిన తర్వాత పక్కకు వచ్చి చూడగా కృష్ణంరాజు ప్రభాస్ ను చూస్తూ అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ప్రభాస్ వాళ్ళ పెదనాన్నను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వాళ్ల పెద్ద నాన్న  ఉండగా రొమాంటిక్ సీన్ చేసినందుకు ప్రభాస్ ఎంతో సిగ్గుపడ్డాడంట. అప్పుడు కృష్ణంరాజు ప్రభాస్ భుజంపై చెయ్యివేసి హీరో అన్నాక ఇవన్నీ కామాన్ అని చెప్పాడట. ఇంక ఈ మూవీకి  సంబంధించిన్న ఎన్నో విషయాలను కూడా అడిగి తెలుసుకున్నాడు. దీనితో  ప్రభాస్ కి కృష్ణంరాజు పై ఎంతో గౌరవం ఉంది అని చెప్పవచ్చు. తరువాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీస్ రెబల్, బిల్లా, రాధే శ్యామ్ మూవీస్ లో కలిసి చేశారు. ఇక మొత్తానికైతే ప్రభాస్  వాళ్ళ పెద్దనాన్న ముందు కూడా యాక్టింగ్ చేయడం మొదలుపెట్టాడు.

 

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?