Pushpa 2 : పుష్ప2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. పుష్పరాజ్ గజ్జెల మోత షురూ

Pushpa 2 : పుష్ప2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. పుష్పరాజ్ గజ్జెల మోత షురూ

Pushpa 2 Teaser Release Date : పుష్ప.. నీ అవ్వ తగ్గేదేలే అంటూ థియేటర్లలో పుష్పరాజ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. పుష్పరాజ్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇరగదీశాడనే చెప్పుకోవాలి. పుష్ప సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలైనప్పటికీ.. అది గ్లోబల్ సినిమా రేంజ్ కి ఎదిగింది. పుష్ప 2 సినిమాకు రాని అవార్డులు లేవు. బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అల్లు అర్జున్ కు దక్కింది. 

అసలు ఒక బాహుబలి, ఒక ఆర్ఆర్ఆర్, ఒక పుష్ప.. ఇలా తెలుగులోనే టాప్ మూవీస్ లో పుష్ప చోటు దక్కించుకుందంటే మామూలు విషయం కాదు. పుష్ప మూవీ రిలీజ్ కాకముందే పుష్ప 2 మూవీని ప్రకటించాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప షూటింగ్ పూర్తవగానే.. పుష్ప2 షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. కానీ.. ఇప్పటికీ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. డిసెంబర్ 2021లో ఈ మూవీ విడుదలైంది.

26 -2

అంటే సినిమా విడుదలై రెండున్నరేళ్లు అయింది. అప్పటి నుంచి సుకుమార్, బన్నీ ఇద్దరూ పుష్ప 2 మీదనే ఫోకస్ పెట్టారు. ఇప్పటికి కానీ పుష్ప 2 షూటింగ్ పూర్తి కాలేదు. అయితే.. ఈ మూవీని అగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే మూవీ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు. 

Pushpa 2 Teaser Release Date : పుష్ప మాస్ జాతరే ఇక 

ఈ మూవీకి సంబంధించి ఒక పోస్టర్ తప్పితే పెద్దగా ఏం రిలీజ్ కాలేదు. కానీ.. ఏప్రిల్ 8న అంటే అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు పుష్ప 2 టీజర్ ను విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. పుష్ప 2 టీజర్ కు సంబంధించిన పోస్టర్ ను తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

పుష్ప మాస్ జాతర షురూ చేద్దాం. అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ టీజర్ ఏప్రిల్ 8 న విడుదల కాబోతోంది. ఈసారి డబుల్ ఫైర్ తో పుష్ప మన ముందుకు రాబోతున్నాడు. 15 ఆగస్టు 2024న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కాబోతోంది.. అంటూ పోస్టర్ లో కేవలం అల్లు అర్జున్ కాలికి గజ్జెలు కట్టుకొని ఉన్న పోస్టర్ ను మాత్రమే వదిలారు. 
పుష్ప పార్ట్ వన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు రాబట్టింది.

26 -3

బాలీవుడ్ లో అయితే స్టార్ సినిమాలను పక్కకు నెట్టేసి పుష్ప మూవీ అత్యధిక వసూళ్లు సాధించి బాలీవుడ్ లో పలు రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో పుష్ప 2 సినిమాపై ఇంకాస్త అంచనాలు పెరిగాయి. అందుకే ఆ అంచనాలకు తగ్గట్టుగానే పుష్పకు మించి పుష్ప 2 రాబోతోందని తెలుస్తోంది. పుష్ప ది రూల్ నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందా? అని అల్లు అర్జున్ అభిమానులు ఇప్పటి వరకు తెగ ఎదురు చూశారు. చివరకు ఆ క్షణం రానే వచ్చింది.

ఇంకో ఆరు రోజులు ఆగితే చాలు.. పుష్ప 2 రూల్ ప్రారంభం కాబోతోంది. పుష్ప సినిమా వల్ల అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాకు ఆయనకు నేషనల్ అవార్డు రావడంతో పాటు మేడమ్ టుస్సాడ్స్ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. పుష్ప 2 మూవీ రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తే ఇక అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ కాబోతున్నారు. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?