Three suicides in family: రెవెన్యూ అధికారులు మోసం చేశారని.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
On
Three suicides in family: బద్వేలు : వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం.కొత్త మాధవరం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి కూతురు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడగా, మరొకరు అదే సమయంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి ఆత్మహత్యకు కారణం రెవెన్యూ అధికారులేనని మృతుల బంధువులు తెలిపారు.
స్థానికుల కథనం ప్రకారం.. మాధవరం గ్రామానికి చెందిన సుబ్బారావు(47) చేనేత కార్మికుడిగా జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి మూడెకరాల పొలం ఉన్నది. అయితే అది అమ్ముదామని ప్రయత్నం చేయడంతో అది ఇతరుల పేరుతో రికార్డుల్లో ఉంది. రెవెన్యూ అధికారుల మోసం వల్ల దానిని అమ్మేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన కుటుంబంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మూడెకరాల పొలం అమ్ముదామని అనుకోగా.. రికార్డులు తారుమారు కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య కు పాల్పడుతున్నట్లు అందులో రాసి ఉంది. పొలం వేరే వాళ్ల పేరుతో రికార్డుల్లో ఉందని.. రెవెన్యూ అధికారుల మోసం కారణంగా చనిపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...