Akshaya Tritiya 2024 : అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి... దానికి కుబేరుడు కి సంబంధం ఏంటి...

Akshaya Tritiya 2024 : అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి... దానికి కుబేరుడు కి సంబంధం ఏంటి...

Akshaya Tritiya 2024 :  హిందూ క్యాలెండర్ ప్రకారం అక్షయ తృతీయ పండగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ తిధినాడు మనం జరుపుకుంటూ ఉంటాం. సూర్యచంద్రుడు ఆకాశంలో ఎంతో ప్రకాశవంతంగా ఉన్న శుభదినం రోజు అక్షయ తృతీయ. అక్షయ అనగా అంతం లేనిది అని అర్థం.

ఈ ప్రత్యేకమైన రోజున స్నానం చేయటం, తపస్సు చేయటం, దానం చేయటం, విష్ణువును పూజించటం లాంటివి చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఈసారి అక్షయ తృతీయ పండగను మే 10వ తారీఖున జరుపుకోబోతున్నాము. అక్షయ తృతీయ రోజు శుభ సమయంగా పరిగణిస్తారు. ఈరోజున ఏమైనా శుభకార్యాలు చేయాలి అనుకుంటే ఏ శుభ ముహూర్తాన్ని పాటించాల్సిన అవసరం కూడా ఉండదు.

మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున లక్ష్మీదేవిని, కుబేరుడ్ని పూజించడం వలన సంపద, ఐశ్వర్యం పెరుగుతుంది అని భావిస్తారు. కుబేరుడ్ని సంపదల దేవుడు అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ఆయనను పూజించటం వలన ఇంట్లో ఉన్నటువంటి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. అంతేకాక మహాభారతాం ప్రకారం. ఈరోజు సూర్యుడు యుధిష్టరుడికి అక్షయపాత్రను ఇచ్చాడు అని చెబుతారు.

080 -2

దాని నుండి వచ్చే ఆహారం ఎప్పటికీ కూడా అయిపోదు. అంతే పరశురాముడు కూడా ఇదే రోజున జన్మించాడు. అందువలన ఆయనని చిరంజీవి అని కూడా పిలుస్తారు. అక్షయ తృతీయనే చిరంజీవి తిధి అని కూడా పిలుస్తారు. కుబేరుడికి స్వర్గం, సంపద సంబంధించిన బాధ్యతలు అప్పగించింది కూడా ఇదే రోజు.

హిందూ మతంలో కుబేరుని ఆరాధనకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉన్నది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని కుబేరుడ్ని పూజించటమే కాక బంగారాన్ని లేక వెండిని కొనుక్కోవడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ అక్షయ తృతీయ రోజు మీరు కొన్న బంగారం వస్తువులను శివుడి ముందు ఉంచి పూజించాలి.

తరువాత బంగారంపై కొంత గంగాజలం పోసి వాటిని శుభ్రపరిచి మీ సేఫ్ లాకర్ లో భద్ర పరుచుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఎప్పటికీ డబ్బు తరిగి పోదు. లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది ఇంట్లో సంపద అపారమైన పెరుగుదలకు దారితీస్తుంది అని ఎక్కువగా నమ్ముతారు. ఈ కథలో అక్షయ తృతీయకు, కుబేరుడు కి సంబంధం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

080 -1

హిందూ మాతంలో తల్లి లక్ష్మీదేవిని సంపద దేవతగా పూజిస్తారు. కుబేరుని కూడా సంపద దేవుడిగా పరిగణిస్తారు. మత విశ్వాసాల ప్రకారం వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిధి రోజు అల్కాపురి అనే రాజ్యాన్ని పాలించే బాధ్యతలు కుబేరుడు స్వీకరించాడు. అంతేకాక అతను స్వర్గం,ఆర్థిక వ్యవహారాలను నిర్వహించేందుకు కూడా ఎంపిక అయ్యాడు.

అదే టైమ్ లో కుబేరుడు ధనవంతుడు కావాలి అని శివున్ని పూజిస్తాడు. అయితే అప్పుడు సంపదకు అధి దేవుడుగా కుబేరుడు ఉంటాడు అని శివుడు వరం ఇస్తాడు. అందువల్ల లక్ష్మీదేవితో పాటుగా కుబేరుని కూడా పూజిస్తారు. కుబేరుడి ఆశీస్సులు ఉంటే ఏ వ్య‌క్తికి అయినా తన జీవితాంతం డబ్బు స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.

వాణిజ్య మరియు సంపద ఎంతగానో పెరుగుతాయి. అందుకే అక్షయ తృతీయ పండగ చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ అక్షయ తృతీయ రోజున కుబేరున్ని, లక్ష్మీదేవిని పూజించటం వలన ఆర్థిక లాభం, వ్యాపారంలో పురోగతి లభిస్తుంది అని ఎక్కువగా నమ్ముతారు. అక్షయ తృతీయ పండగ రోజున స్నానం చేయకుండా తులసి కోటను ముట్టుకోకూడదు.

080 -3

స్నానం చేయకుండా తులసి కొమ్మలను విరవటం వలన విష్ణుమూర్తికి కోపం వస్తుంది అని నమ్ముతారు. ఈ ప్రత్యేకమైన పండగ రోజున లక్ష్మి దేవి ఇంటికి చేరుతుంది అని నమ్ముతారు. కావున ఇంట్లో శుభ్రత పట్ల ఎంతో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే తల్లి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మురికి ప్రదేశాలలో ఉండలేదు.

అక్షయ తృతీయ రోజున మాంసాహారం, మద్యం లేక తామస వస్తువులను తినకూడదు. ఒకవేళ ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది అని, దీనివలన వ్యక్తి జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుందని నమ్ముతారు.

ఈ అక్షయ తృతీయ రోజున విష్ణువు,లక్ష్మీదేవి, అన్నపూర్ణ, కుబేరుడికి బియ్యాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దాని తర్వాత ఆ బియ్యాన్ని మీరు వాడుకునే బియ్యం లో కలుపుకొని రోజు అన్నం వండుకోవాలి. ఇలా చేయడం వల్ల వారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు లభిస్తాయి..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?