Lakshimi Devi : లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని తెలిపే ఐదు సంకేతాలు ఇవే...

Lakshimi Devi : లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని తెలిపే ఐదు సంకేతాలు ఇవే...

Lakshimi Devi : సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం ఎంతోమంది ఆమెను పూజిస్తూ ఉంటారు. దాని ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు తమపై నిలిచి ఉంటాయని ఎంతో నమ్మకంగా ఉంటారు. లక్ష్మీదేవి తమని సిరిసంపదలతో ముంచెత్తుతుందని ధనవంతులను చేస్తుందని లక్ష్మీ అనుగ్రహం పొందడానికి పూజలు చేస్తుంటారు.

అయితే లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే సుఖం శాంతి లభించదనే నమ్మకం.  ఆ అమ్మ అనుగ్రహం కోసం తాపత్రయపడుతూ ఉంటారు. అయితే ఎవరి ఇంట్లోకైనా సరే లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సంకేతాలను ఇచ్చి మరి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రగాఢ నమ్మకం.

ఇళ్లు ఎప్పుడు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు కూడా లేకుండా ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి నివసించే ఇల్లు శ్రేయస్సును కలిగిస్తుందని మత విశ్వాసం. ఇక లక్ష్మీదేవి రాకముందు అనేక శుభసంకేతాలను సైతం ఇస్తుందని కూడా నమ్మకం. మరి ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఇంట్లో ఒక్కసారిగా నల్ల చీమలు గుంపులు గుంపులుగా ఏర్పడి ఏదైనా వస్తువును తినడం కనుక ప్రారంభిస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా చెప్పబడింది. ఇంట్లో ఒకే చోట మూడు బల్లులు కనిపించడం కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతంగా నమ్ముతారు. ఇది ఎంతో శుభసూచికంగా కూడా పరిగణించబడుతుంది.

189 -2

ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లి కనిపించడం కూడా ఎంతో శుభకరమైనటువంటి సమయంగా చెప్తూ ఉంటారు. అదే సమయంలో తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు కనిపించడం విరుద్ధమైన సంకేతంగా చెప్పబడింది. కేవలం ఒక్క బల్లి మాత్రమే తులసి మొక్క దగ్గర కనిపిస్తే ధన లాభం జరుగుతుందని అంటారు.

అంతే కాదండి మీ కుడి చేతిలో నిరంతరం దురద వస్తునా కూడా ఇది ధనాన్ని అందించే మంచి సంకేతంగా చెప్తూ ఉంటారు. కలలో చీపురు, గుడ్లగూబ ఇంకా ఏనుగు, ముంగిస ,శంఖం, బల్లి, పాము, గులాబి లాంటి వస్తువులు గనుక కనిపించినా కూడా అది మీ ఇంటికి అష్టైశ్వర్యాలను తెచ్చిపెట్టే శుభసంకేతంగా పరిగణించబడుతుంది. కాబట్టి లక్ష్మీదేవికి ప్రియమైన వ్యక్తులుగా మిమ్మల్ని పరిగణించబడుతుంది. 

ఆ తల్లి అనుగ్రహం పొందడం కోసం  ఇంట్లోనే గ్యాస్ స్టవ్ అనేది అంటే మనం వండుకుని తినేటటువంటి పొయ్యి అనేది లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము. కాబట్టి ప్రతిరోజు గ్యాస్ పొయ్యిని శుభ్రంగా తుడుచుకోవడం వల్ల కూడా ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీపై కలుగుతుంది. ఇంకా  చాలామంది చీపురును కాలితో తొక్కుతూ లేదంటే ఏదో ఒక మూలన పెట్టేస్తూ ఉంటారు.

189 -3

కానీ అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే చీపురుని ఇంకా మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాం. కాబట్టి చీపురును ఎట్టి పరిస్థితులను కాలితో తొక్కు కూడదు. ఇల్లంతా ఊడ్చిన తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో చీపురుని ఉంచాలి. దీంతో పాటుగా పూజ గది కూడా ఎంతో శుభ్రంగా ఉంటే చాలా మంచి అదృష్టం కలిసి వస్తుంది.

పూజ గదిలో విరిగిపోయిన పటాలు ఇంకా చిరిగిపోయిన ఫోటోలు లాంటివి పెట్టుకోకూడదు. కచ్చితంగా అలాంటివి ఉంటే ఏదైనా ఆలయంలో గాని పారే నదిలో గాని వేసేస్తే మంచిది. ఇక ఇంట్లో మన పూజా మందిరం గానే తులసి కోట చుట్టూ గాని ఎటువంటి దుమ్ము దులి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకుంటూ ఉండాలి.

ఈ విధంగా శుభ్రంగా చేసుకుంటూ ఉంటే కచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీపై ఎప్పుడు ఉంటుంది. ఈ విధమైనటువంటి సంకేతాలు సూచనలు పాటిస్తూ ఉంటే కచ్చితంగా మీపై ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా మీరు గుర్తించి లక్ష్మీదేవి ఉండేందుకు మరింత పరిశుభ్రంగా ఉంటూ ఇంకా మీరు మీ విలువలను కాపాడుకుంటూ ఉంటే గనుక కచ్చితంగా అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?