Nalgonda : 18 అడుగుల శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి విగ్ర‌హ‌ ప్రతిష్టాపన

తెలంగాణలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహం

Nalgonda : 18 అడుగుల శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి విగ్ర‌హ‌ ప్రతిష్టాపన

Nalgonda : నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 11 (క్విక్ టుడే) :  తెలంగాణలోనే కనీవినీ ఎరుగని రీతిలో గర్భగుడి లో 18 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి అతిపెద్ద విగ్రహాన్ని నల్గొండ పట్టణం పాతబస్తీ హనుమాన్ నగర్ లో శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్టాపన చేశారు. కేంద్ర మంత్రి గంగవరం కిషన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఆదివారం చాలా శుభదినం అని 48 సంవత్సరాల హిందువుల పోరాటాల ఫలితంగా కేసులు, జైలు బరించి వాళ్ల త్యాగాల ఫలితంగా ఈరోజు మనం 18 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకున్నామ‌ని కేంద్రమంత్రి అన్నారు. అయోధ్యలో బాల రాముని యొక్క ప్రాణ ప్రతిష్ట అయ్యి నెలరోజుల వ్యవధిలోనే మన నల్లగొండలో 18 అడుగుల అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకోవడం చాలా సంతోషమన్నారు.

ఈ దేవాలయ నిర్మాణానికి అన్ని రకాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరి చందన, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విగ్రహ ప్రతిష్టలో పూజ లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  మాట్లాడుతూ విగ్రహ దాతగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని, దేవాలయానికి అవసరమైతే ఇంకా నా సహకారాలు అందిస్తానని అన్నారు. విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నందుకు భక్తులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం సువర్చల సమేత అభయాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితులు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ శాశ్వత అధ్యక్షులు వెనేపల్లి లక్ష్మణరావు, అధ్యక్షులు బైరగొని రాజయ్య, ఉపా అధ్యక్షులు వీరేల్లి చంద్రశేఖర్, ఇటికాల కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి బండారు ప్రసాద్, గౌరవ సలహాదారులు కంది సూర్యనారాయణ, గార్లపాటి వెంకటయ్య, నన్నూరి రామ్ రెడ్డి, కోశాధికారి చింత హరిప్రసాద్, కార్యదర్శులు గుండెబోయిన వెంకటేశ్వర్లు బొడ్డుపల్లి సతీష్ సురిగిల్ల యాదగిరి, ఊటకూరి శ్రీనివాస్,కస్పరాజు.వెంకన్న, గుoడెబోయిన. శేఖర్, గుండెబోయిన మల్లయ్య, కౌన్సిలర్ అభిమన్య శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?