Old Temple Secrets : సైన్స్ కే అంతుచిక్కని 1500 ఏళ్ల నాటి ఆలయ రహస్యాలు...
Old Temple Secrets : మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలలో సైన్స్ కి అంతుచిక్కని కొన్ని రహస్యాలు ఉన్నాయి. పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన అతి పురాతన దేవాలయం మహానంది పుణ్యక్షేత్రం. సుమారు 1500 ఏళ్ల చాళుక్య మహారాజుల ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆక్కడ స్థల పురాణం చెప్తోంది.
సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నందీశ్వర రూపంలో ఆక్కడ సహిత నందీశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. 15 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో సైన్స్ కూడా అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. దీనిలో ముఖ్యమైనది క్షేత్రంలో రుద్ర గుండం కోనేరు. ఈ దేవాలయంలో లోపల ఉన్న ఈ రుద్రగుండం కోనేరులోని నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో ఇప్పటికీ శాస్త్రవేత్తలు కనిపెట్టలేక పోయారు.

భూగర్భ జల వనరుల ఉపరితల జల రక్షణ తెలుగు గంగ ప్రాజెక్టు అధికారుల చేత పరిశోధనలు సంవత్సర కాలం పాఠం చేయించగా.. ఈ మేరకు కోనేరు చుట్టుకొలత నీటి లెవెల్ తగ్గకుండా ప్రవహించడం ఓ విచిత్రం. నీటిలో ఉన్న మినరల్స్ తదితర అంశాలపై పరిశోధన ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు.
కార్బోనేట్, కాలుష్యం, క్లోరైడ్, మెగ్నీషియం, హైడ్రో కార్పోనేట్, సోడియం ఇతర మినరల్స్ ఈ నీటిలో పుష్కలంగా ఉన్నాయని అందువలన ఈ నీళ్లకు ఇట్టాంచ్ గుర్తింపు వచ్చినట్లు ఆయన చెప్తున్నారు.
1500 సంవత్సరాలుగా పారుతున్న ఈ నీళ్ల స్వచ్ఛత చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే..

మహానంది రుద్రగుండం కోనేరులోని నీటిలో సూది వేసిన కనపడుతుంది. అంటే అంత స్వచ్ఛంగా ఈ నీరు ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు నీటిలో స్నానం చేసే సకల రోగాలు తగ్గుతాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు.. ఈ కోనేరులో ఉండే నీళ్లు సైతం ఎప్పటికీ ఎండిపోకుండా నిత్యం ఒకే లెవెల్ లో పారడం ఓ విశేషం.
జిల్లాల్లో కరువు విలయం తాండవం చేసిన ఇక్కడ నీరు ఎప్పటికీ పారుతూనే ఉంటుంది. అంతే కాదు.. ఇక్కడ నుంచి నీళ్లు బయట దాదాపు 500 ఎకరాలకు పారడం ప్రత్యేకమైన విశేషమని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు.
