నల్లగొండ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు ప్రారంభం
On
నల్లగొండ. ఫిబ్రవరి 8, క్విక్ టుడే (ప్రతినిధి) : నల్లగొండ పాతబస్తి హనుమాన్ నగర్ లో నూతనంగా నిర్మాణం చేసిన అభయాంజనేయ దేవస్థానంలో నాలుగు రోజుల పూజా కార్యక్రమంలో భాగంగా గురువారం రోజు పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. గోపూజ, గణపతి పూజ, పుణ్యహా వచనం - పంచగవ్యప్రశాన - రుత్విక్ వరణం - దీక్షాధారణ మాతృకా పూజనం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు జలాధివాసం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్క హిందూ కుటుంబం నుండి నీళ్ళు, పంచామృతాలు తీసుకొని వచ్చి వారి యొక్క స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుందని అర్చకులు దేవలపల్లి నాగరాజు శర్మ తెలియజేశారు..
ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య అర్చకులు దేవులపల్లి నాగరాజు శర్మ, మద్దులూరి శ్రీనివాసా శర్మ, శాశ్వత అధ్యక్షులు వేయన పల్లి లక్ష్మణరావు, బైరవని రాజయ్య గౌరవ అధ్యక్షులు, వీరెల్లి చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు, బండారు ప్రసాద్ కార్యదర్శి, గార్లపాటి వెంకటయ్య, ఇటికాల కృష్ణయ్య, రేవల్లి కాశమ్మ, రావిరాల వెంకట్, నున్నరి రామిరెడ్డి, బొడ్డుపల్లి సతీష్, సిరుగుల్లా యాదగిరి, గుండబోయిన వెంకన్న, దాసోజు యాదగిరి, దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
