రేపే అత్యంత శక్తివంతమైన మాఘ పౌర్ణమి.. కొడుకులు ఉన్న‌వారు ఈ పరిహారం తప్పక చేయాలి...

రేపే అత్యంత శక్తివంతమైన మాఘ పౌర్ణమి.. కొడుకులు ఉన్న‌వారు ఈ పరిహారం తప్పక చేయాలి...

మాఘ మాసం అంటే పవిత్ర స్నానాలు చేయాలని మన ఋషులు కూడా నిర్ణయించారు.. లక్ష్మీనారాయణ లకు ప్రీతికరమైన మాసం. కాబట్టి ఈ మాసం ఎంతో ప్రధానమైనది.. విద్యార్థి దేవత వాగ్దేవి అయిన సరస్వతి దేవి ఈ మాఘమాసంలోనే వసంత పంచమి నాడు జన్మించింది. అందుకే శ్రీ పంచమి అని అంటారు. శ్రీ అంటే లక్ష్మీదేవి అని మనందరికీ తెలుసు. మానవులకు అవసరమైన ఆరు సంపదల్లోనూ విద్యాసంపద కూడా ఒకటి. కాబట్టి శ్రీ మహాలక్ష్మి శ్రీ పంచమి నాడు సరస్వతి దేవి రూపంలో దర్శనమిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం కూడా జరిపిస్తారు. ఈ మారఘమాసంలోనే ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడు జన్మించాడు. అందుకే మాఘ సిద్ధ సప్తమి రథసప్తమి పర్వదినం అయింది. కాబట్టి నది అందుబాటులో ఉంటే వాటిల్లో నడుమునిగేవరకు నీలచుని మీరు స్నానం చేస్తే కనుక మీరు సకల శుభాలు పొందుకుంటారు.ఇక చేయవలసినటువంటి పరిహారం గురించి చూసినట్లయితే కనుక మీరు కూడా కచ్చితంగా వీలైతే సూర్యోదయానికి ముందే మీరు తలస్నానం చేయండి. 

అలాగే మీ కొడుకులకి కూడా తలస్నానం చేయించండి. పెద్దవారైతే వారికి చెప్పండి అంటే కచ్చితంగా శుభ్రం చేసుకున్న తర్వాత కచ్చితంగా మీరు ఈరోజు తలస్నానం చేసిన తర్వాత మీరు సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి. అంటే సూర్యుడికి నమస్కరించే నీటిని సమర్పించండి. అలాగే మీ పూజ మందిరంలో దేవుని పటాలు శుభ్రం చేసుకొని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించండి. అలాగే మీకు వీలైతే విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయండి. శివ కేశవులు ఇద్దరినీ కూడా ఈరోజు మీరు పూజించాలి. ఈ విధంగా పూజలు చేసిన తర్వాత మీరు సాయంత్రం లోపు ఈ పరిహారం ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో మాత్రం కచ్చితంగా దీపారాధన చేయాలి. అంటే పౌర్ణమి పరిహారం చేసే సమయంలో కచ్చితంగా దీపారాధన చేయాలి. తప్పకుండా ఫలితం అనేది దక్కుతుంది. అయితే ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత సాయంత్రం లోపు ఏ సమయంలో అయినా సరే  మీకు వీలైన సమయంలో మీ కొడుకులను తూర్పుముఖంగా  నిల్చో బెట్టండి. ఒక రెండు నిమ్మకాయలను తీసుకొని అంటే ఆ నిమ్మకాయలు కూడా పాడైపోయినవి కాకుండా మరి పసుపు రంగులో ఉన్నవి కాకుండా శుభ్రంగా ఉన్న నిమ్మకాయ లను తీసుకోండి. 

ఆ రెండు నిమ్మకాయలను తీసుకొని వాటిని ఒక పువ్వు ఆకారంలో రెండు నిమ్మకాయలు కట్ చేసుకుని వాటిపైన అంటే ఆ పువ్వు ఆకారంలో ఎక్కడైతే మీరు కట్ చేసుకున్నారో దాని మధ్యలో కొంచెం పసుపు ,కొంచెం కుంకుమ వేసి తర్వాత ఆ రెండు నిమ్మకాయలు మీ రెండు చేతుల్లో పట్టుకుని మూడుసార్లు తిప్పిన తర్వాత మీరు ఆ యొక్క నిమ్మకాయ తీసుకుని వెళ్లి రెండు చేతుల్లో ఒక్కొక్క నిమ్మకాయను పట్టుకొని నిచ్చెల ప్రదేశం దగ్గరికి వెళ్లి ఈ విధంగా పడివేసి  తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. అలాగే మీ కొడుకులను వెళ్లి కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని రమ్మని చెప్పండి. ఆ ఈ విధంగా నిమ్మకాయతో దిష్టి తీయడం అనేది చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అలాగే వారిపై ఉన్నటువంటి దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వారి జీవితంలో ఎటువంటి లోటు అయితే ఉందో ఆ లోటు కచ్చితంగా భర్తీ అవుతుంది. అలాగే వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలకి పరిష్కారం కూడా ఖచ్చితంగా లభిస్తుంది. అంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సరే వారిపై ఉన్నటువంటి కీడు తొలగిపోవడానికి కచ్చితంగా రేపు మాఘపూర్ణమి రోజు శనివారం రోజు అంటే ఈ శనివారం రావటం అనేది ఇంకా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి కచ్చితంగా మార్పులు చూస్తారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?