Central Govt Jumbo notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ కంపెనీల్లో జంబో నోటిఫికేషన్..
గేట్ గ్రాడ్యుయేట్ అప్ టూడ్ టెస్టింగ్ ఇంజనీరింగ్ క్వాలిఫై అయిన వారు అప్లై చేసుకోవచ్చు.. అధికారిక వెబ్ సైట్ npcilcareers.co.in చూసి అప్లై చేసుకోవచ్చు.. అప్లికేషన్ ప్రాసెస్ ఏప్రిల్ 30తో ముగియనుంది. ఈ రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి..

అప్లికేషన్ ప్రాసెస్; ముందు ఎన్పీసీఐఎల్ అధికారిక పోర్టల్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. ఓం పేజీ కెళ్ళి కెరీర్ అప్లికేషన్ క్లిక్ చేయాలి..
ఇక్కడ పేరు మొబైల్ నెంబరు ఈమెయిల్ లాంటి పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ ఐడి పాస్వర్డ్ వంటి వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత ఎన్ పి సి ఐ ఎల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి.
అప్లై నౌ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు పెట్టుకోవాలి. రిజిస్టర్ ఐడి తో లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయాలి. ఇక్కడ అన్ని వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫామ్ లో సబ్మిట్ చేసుకోవాలి.

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఇన్ ఇంజనీరింగ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్ చదివిన విద్యార్థులు రిక్రూట్మెంట్ కి దరఖాస్తు చేసుకోవాలి. తప్పనిసరిగా కనీసం 60 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి. చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు హాజరవుతున్న అభ్యర్థులు సైతం అప్లై చేసుకోవడానికి అర్హులు గేట్ క్వాలిఫై అవ్వడం ముఖ్యం.
వయోపరిమితి; దరఖాస్తుల వయసు 2024 ఏప్రిల్ 30 నాటికి 26 ఏళ్లు పెంచకూడదు.. అయితే ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా మూడేళ్లు ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు పిడబ్ల్యుడి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో పదేళ్ల సడలింపు ఉంటుంది..
