Dry Promotion : డ్రై ప్రమోషన్... ఇదో కొత్త ట్రెండ్...
చిన్నచిన్న స్టార్టప్స్ నుండి బడా బడా టేక్ కంపెనీల వరకు ప్రాజెక్టుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఈ సక్షోభం నుండి బయట పడేందుకు ఖర్చు విషయంలో కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడు ఉద్యోగుల జీతాల విషయంలో డ్రై ప్రమోషన్ విధానాన్ని అవలంబిస్తున్నారు.

ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ పర్ల్ మేయర్ నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపుగా 13 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు శాలరీ పెంచలేని ప్రమోషన్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 2018 లో 8 శాంతంగా ఉన్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపారు.అంతే మెర్స్ న్ అనే సంస్థ 900 కంపెనీలను సర్వే చేసింది.
అంతే పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు నేపథ్యంలో చాలా సంస్థలలో సిబ్బంది తగ్గిన విషయం మనకు తెలిసిందే. దీనివలన కీలక బాధ్యతలు అప్పగించటం కోసం కొందరిని ఇలా ప్రమోట్ చేస్తున్నట్లుగా తెలిపారు. నిజంగానే ఈ రెండు కొనసాగుతున్నట్లుగా ప్రస్తుతం పలువురు ఉద్యోగులు సోషల్ మీడియాలో పంచుకున్నారు..

కంపెనీలో తమ హోదాకు మించి పనిచేస్తున్న తరుణంలో తన జాబ్ టైటిల్ నుండి 'జూనియర్ 'అనే పదాన్ని తొలగించారు. ఒక ఉద్యోగి ఇటీవల రెడిట్ త్రేడ్ లో తెలిపారు. శాలరీలో మాత్రం ఎలాంటి మార్పులు చేయము అని తెలిపారు. టైటిల్ మాత్రమే పెరగటం వలన ప్రయోజనం ఉంది అని అంటున్నారు మరికొందరు.
జాబ్ మారాలి అని అనుకునేవారు కొత్త కంపెనీలో ఉన్నత హోదాలో బాధ్యతలు స్వీకరించే అవకాశం వస్తుంది అని అభిప్రాయపడ్డారు. కంపెనీలు ఆఫీస్ కి కచ్చితంగా రావాలి అని ఆదేశించడానికి వ్యతిరేకిస్తూ ఉద్యోగులు కాఫీ బ్యాడ్జిగ్ విధానాన్ని అవలంబించిన విషయం మనకు తెలిసిందే.రమ్మన్నారు గా అని అలా వచ్చి కాఫీ తాగి మేనేజర్లు, హెచ్ ఆర్ ల దృష్టిలో పడి ఇంటికి వెళ్లడానే కాఫీ బ్యాడ్జిగ్గా వ్యవహరించారు.
యాజమాన్యానికి తెలియకుండా మరో ఉద్యోగం చేయడానికి మూన్ లైటింగ్ అని అంటారు.వాళ్లు కేవలం అప్పగించిన బాధ్యతలు మాత్రమే తీసుకొని ఇతర పనులు నుండి తప్పించుకోవడాన్ని క్వెట్ క్వి టింగ్ అని తెలిపారు. ఇలా కార్పోరేట్ రంగంలో ఎన్నో పదాలు ప్రస్తుతం తెరపైకి వచ్చాయి..
