మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ మరో సంచలన వార్తల్లోకి ఎక్కారు. ప్రస్తుతం 71 ఏండ్ల వృద్ధాప్య వయస్సులో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఇంత లేటు వయస్సలో తన కన్నా 32 ఏండ్ల చిన్న వయస్సు ఉన్న మహిళ ఎకటెరినా మిజులినా (39) తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. వీరి ప్రేమ వ్యవహారంపై న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. ఆలస్య జీవితంలో అమృతమైన గడియలతో గడుపుతున్నట్లు పేర్కొంది. చరిత్రకారిణి అయిన మిజులినా రష్యాలోని ఓ సేఫ్ ఇంటర్నెట్ లీగ్ సంస్థను నడిపిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆమె రష్యా పట్ల వ్యతిరేక వార్తలను ఖండించే పనిలో ఉన్నారు. కాగా వీరి మధ్య సాన్నిహత్యం పెరిగింది. వీరిద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒక్కటే విధంగా ఉండడంతో వీరు తమ ప్రేమ వ్యవహారంలో మునిగిపోయారు.
బార్బీ బొమ్మలాగా ఉండే రష్యా భామ ఎకటెరినా మిజులినా రష్యా సెనెటర్ ఎలెనా మిజులినా కుమార్తె. ఎలెనా మిజులినా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు బలమైన మద్దతుదారుల్లో ఒకరు కావడం విశేషం. ఎకటెరినా మిజులినా చాలా అందంగా ఉంటుంది. పుతిన్‌కు సరియైన జోడిగా ఆమె కనిపిస్తుంది. వీరిద్ధరూ తమ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. పుతిన్‌కు అనుగుణంగా ఆమె నడుచుకుంటుంది. అందువల్లే వీరు ఒక్కటయ్యారని రష్యా మానవ హక్కుల కార్యకర్త రొమానోవా ఉక్రెయిన్ న్యూస్ ఛానెల్‌కు లీక్ చేశారు. ఎకటెరినా మిజులినా 2004లో లండన్ విశ్వవిద్యాలయం నుంచి కళా చరిత్రలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. సేఫ్ ఇంటర్నెట్ లీగ్ సంస్థ స్థాపించక ముందు ఆమె చైనాను సందర్శించే అధికారిక రష్యన్ బృందానికి అనువాదకురాలిగా పనిచేసింది.
అనంతరం రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై రష్యాకు వ్యతిరేకంగా వస్తున్న కంటెంట్‌ను నిరోధించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడి కన్ను ఆమెపై పడిందని, వీరి ప్రేమాయణంపై రష్యాలోని సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. కాగా పుతిన్ 1988లో మాజీ ఫ్లైట్ అటెండెంట్ ల్యూడిమిలాను వివాహం చేసుకున్నారు. 2014లో ఆమెకు విడా కులు ఇచ్చేశారు. ఆ తర్వాత అలీనా కబయేనాతో పుతిన్ రహస్య ప్రేమాయణం కొనసాగించినట్లు వార్తలు వచ్చాయి. ఆమె జిమ్నాస్టిక్స్ విభాగంలో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిందని, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు రూమర్లు వచ్చాయి. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.