South Korea Elections : ముగిసిన సౌత్ కొరియా ఎన్నికలు.. అధికార పార్టీని మట్టికరిపించిన ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ
ప్రస్తుతం సౌత్ కొరియా ప్రెసిడెంట్ గా ఉన్న యూన్ సుక్ యోల్ ను దక్షిణ కొరియా ప్రజలు ఓడించారు. సైత్ కొరియాలో ప్రధానంగా ఉన్నది రెండు పార్టీలే. ఒకటి అధికార పీపుల్ పవర్ పార్టీ. మరొకటి డెమొక్రటిక్ పార్టీ. ఈ రెండు పార్టీలు ఈసారి అధికారం కోసం పోటీ పడ్డాయి.
South Korea Elections : సౌత్ కొరియాలో ఉన్న ఓటర్ల సంఖ్య 4.4 కోట్లు

నిజానికి సౌత్ కొరియా ఎన్నికలు 2027 లో జరగాల్సి ఉంది. 2022 లోనే యూన్ సుక్ అధికారంలోకి వచ్చారు. కానీ.. మధ్యలోనే ప్రజాభిప్రాయం కోసం రెఫరెండం నిర్వహిస్తున్నారు. ఈ రెఫరెండంలో ప్రతిపక్ష పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. ఇవి 22వ పార్లమెంటరీ ఎన్నికలు.
99 శాతం ఓట్లు నమోదు కాగా.. ఇందులో 161 జిల్లాల్లో డెమొక్రటిక్ పార్టీ ముందంజలో ఉంది. 90 జిల్లాల్లో మాత్రమే యూన్ పార్టీ ముందంజలో ఉంది.. అని నేషనల్ ఎన్నికల కమిషన్ డేటా తెలిపింది.
డెమోక్రటిక్ పార్టీ 154 సీట్లను కైవసం చేసుకోగా.. అధికార పీపుల్ పవర్ పార్టీ 114 సీట్లలో మాత్రమే గెలువగలిగింది. అయితే.. ఇప్పటి వరకు ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ.. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం చూస్తే, ప్రముఖ బ్రాడ్ కాస్టర్స్ కేబీఎస్, ఎంబీసీ, ఎస్బీఎస్ జాయింట్ సర్వేల ప్రకారం చూస్తే ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ లీడ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

196 సీట్ల వరకు డెమొక్రటిక్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పీపుల్ పవర్ పార్టీ 105 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. యూన్ రెండేళ్ల నుంచి అధికారంలో ఉన్నా.. ఇప్పుడు మెజారిటీ రాకపోయినా కూడా మరో మూడేళ్లు మెజారిటీ లేకుండానే యూన్ తన అధ్యక్ష పదవిలో కొనసాగబోతున్నారు.
అలాగే.. డెమొక్రటిక్ పార్టీ అధినేత లీ జేయ్ మ్యుంగ్ ను యూన్ ఓడించారు. అందుకే డెమొక్రటిక్ పార్టీ అధిక స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్నా.. ప్రెసిడెంట్ గా మాత్రం యూన్ మరో మూడేళ్లు కొనసాగనున్నారు.
ఈ ఎన్నికల్లో పలు చిన్న పార్టీలు కూడా ఎన్నికల బరిలోకి దిగాయి. రీబిల్డింగ్ కొరియా పార్టీ 12 నుంచి 14 సీట్లలో గెలిచే అవకాశం ఉందని కేబీఎస్ తెలిపింది. రీబిల్డింగ్ కొరియా పార్టీ అధ్యక్షుడు చో కుక్ మాట్లాడుతూ.. ప్రజలు గెలిచారు. యూన్ సుక్ ప్రభుత్వాన్ని పడగొట్టారు.. అంటూ చో కుక్ మీడియాకు తెలిపారు.
