Elon Musk: X సోషల్ మీడియాలో పనిచేసే ఉద్యోగులకు ట్విస్ట్ ఇచ్చిన ఎలన్ మస్క్?
ఎక్స్ లోని ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులను తొలగించినట్లు తాజాగా ది వెజ్ లోని ఒక నివేదిక తెలిపింది . అయితే అందులో ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నది అన్న విషయమైతే ఇంకా స్పష్టత రాలేదని ఈ నివేదికే తెలిపింది. రెండు నెలల క్రితం కంపెనీకి సంబంధించి వారు ఏం చేశారు తెలియజేసే విధంగా ఒక పేజీ నివేదిక ఇవ్వాలని ఎక్స్ ఉద్యోగులను కోరింది. అలా కోరిన రెండు నెలలకే ఉద్యోగులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఉద్వాసన పలికినట్లు నివేదిక పేర్కొంది. ఉద్యోగులకు మెయిల్స్ ద్వారా లే ఆప్స్ సమాచారం అందించినట్లు తెలిసింది.
ప్రస్తుతం అన్ని రంగాలలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువ అవుతుండడంతో ఖర్చులు తగ్గించుకోవడానికి అన్ని కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే ఎక్కువ ఖర్చులు తగ్గించుకొని ఎక్కువ లాభాలను పొందాలని ఆలోచనలో అన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. కాబట్టి విడతల వారీగా ఉద్యోగులను ఇప్పటికే చాలా కంపెనీలు అనేవి ఉద్యోగులను తొలగిస్తూ ఇంటికి పంపిస్తున్నాయి.
ఈ తరహా లోనే మస్కు కూడా కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పుకోవచ్చాడు. ఇప్పుడే కాదు మస్కు 2022లో కూడా ట్విట్టర్ని కొనుగోలు చేసిన సమయంలో 6000 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కూడా తొలగించిన విషయం మనం అందరికీ తెలిసిందే. ఇదే ఆ కంపెనీలో దాదాపు 80% సిబ్బంది. కాగా మునుముందు ఎలన్ మస్క్ మరి ఎంతమందిని తొలగిస్తారు అని ఉద్యోగులు అందరు కూడా ఆందోళన చెందుతున్నారు.