Mosquitoes : ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉందా... అయితే ఇలా చేయండి...
మరోవైపు దోమల కారణంగా మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి. దీంతో చాలామంది దోమల నుండి వచ్చే ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే మార్కెట్ లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్స్ ఉపయోగించి దోమలను తరిమికొట్టడం వలన వాటి ప్రభావం దోమలపై కంటే మనుషులపైనే ఎక్కువగా ఉంటుందని చెప్పాలి.

కర్పూరం...
ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గదిలో కర్పూరం అనేది సర్వసాధారణంగా ఉండే వస్తువు. అయితే ఈ కర్పూరం దోమలను తరిమికొట్టడానికి చాలా సులభమైన మార్గమని చెప్పాలి. ఎందుకంటే కర్పూరపు ఘాటు వాసన కారణంగా దోమలు క్రిమికీటకాలు దగ్గరకు రాలేవు. కాబట్టి దోమలు బెడద నుండి మీరు విముక్తి పొందాలంటే ప్రతి రోజు సాయంత్రం మీ ఇంట్లో ఒక కర్పూరాన్ని వెలిగించడం మంచిది.
టీ ట్రీ ఆయిల్....
ఈ టీ ట్రీ ఆయిల్ ఉపయోగించటం వలన దోమలు లేదా కీటకాలు దూరంగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికోసం మీరు ఒక క్రీమ్ లోషన్ ఉపయోగించుకోవచ్చు. మీరు దోమ కాటుకు గురైనప్పుడు దద్దుర్లు లేదా చికాకు అనిపించినప్పుడు దాని నుండి ఉపశమనం పొందేందుకు ఈ ప్రత్యేకమైన ఆయిల్ ఉపయోగించుకోవచ్చు. తద్వారా దోమల నుండి ఉపశమనం పొందవచ్చు.

వేపాకు కాల్చడం...
ఆయుర్వేదంలో వేపాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అంతేకాక వేపాకులు ఆరోగ్యానికి మేలు కలిగించే , పోషకాలు ఎన్నో దాగి ఉన్నాయి. అయితే దీని ద్వారా కూడా దోమలు బెడద తొలగించుకోవచ్చు. అదెలా అంటే మీ ఇంట్లోకి పదే పదే దోమలు వస్తున్నాయి అంటే మీరు వేపాకులను కాల్చి వాటిని ధూపంగా ఉపయోగించవచ్చు. తద్వారా ఇంట్లోకి దోమలు రాకుండా వెంటనే అన్ని బయటకు వెళ్లిపోతాయి. దీనికోసం మీరు వేప నూనె కూడా ఉపయోగించుకోవచ్చు.
వేల్లుల్లి...
అదేవిధంగా వెల్లుల్లి లో ఉండే కొన్ని రకాల పోషకాలు దోమలతో సహా ఇతర కీటకాలకు వ్యతిరేకంగా ప్రభావతం చేస్తుంది. వెల్లుల్లి కాల్చడం వలన ఆ వాసనకు ఆ ప్రాంతంలోని దోమలు వారాలపాటు రాకుండా ఉంటాయి. ఈ విధంగా చేయడం వలన మీరు మీ ఇంట్లో ఎలాంటి దోమలు లేకుండా హాయిగా ఉండొచ్చు
