Coconut Oil Benefits : కొబ్బరి నూనె రాసి వారానికి ఒక్కసారి స్నానం చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు...
Coconut Oil Benefits : కొబ్బరి నూనె అన్ని నూనెలాగే దీన్ని కూడా భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఈ సాంప్రదాయం ఎక్కువగా ఉంది. మంచి సువాసన రుచి కలిగించే ఈ నూనె వంటకాలుకు ఇవ్వడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. కొబ్బరి నూనె ఓ దివ్య ఔషధంగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఇది గుండె పని తీరుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. తల వెంట్రుకలకు ఉపయోగపడే ప్రోటీన్ కొబ్బరి నూనె సంరక్షిస్తుంది. ఈ కారణంగా తల వెంట్రుకలు చిట్లిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి. పంటి నొప్పులు చిగుళ్ల సమస్యలు ఇతర నోటి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవడానికి ఆయిల్ పుల్లింగ్ చేస్తుంటారు. కొబ్బరినూనె వాడుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా సంరక్షిస్తుంది.శరీరానికి ఆయిల్ మసాజ్ చేసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
వారానికొకసారి కొబ్బరి నూనె రాసి స్నానం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. కొబ్బరి నూనెలో ఎన్నో ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి శరీరానికి చాలా మంచిది. అందుకే ఈ కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కొబ్బరి నూనెలోని గుణాలు:
కొబ్బరి నూనెలో హైడ్రేటింగ్ ఆంటీ బ్యాక్ రియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. చర్మానికి చాలా లాభాలు ఉన్నాయి. కావున వారానికి ఒక్కసారైనా కొబ్బరి నూనె తలకి పెట్టడం చాలా మంచిది.. అయితే ఈ ఆయిల్ మసాజ్ వలన కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చర్మ సమస్యలకు చెక్;
కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లోమేటరీ యాంటీ బ్యాక్టీరియా గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి. కొబ్బరి నూనెలోని లారీక్ యాసిడ్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ పండగల్ గుణాలు ఇన్ఫెక్షన్ సూక్ష్మజీవులకి వ్యతిరేకంగా పోరాడతాయి. అలాగే దీనిని మసాజ్ చేయడం వల్ల చర్మం ఉపశమనం పొందుతుంది. కావున ఈ నూనె అప్లై చేయడం శరీరానికి ఎంతో మంచిది..

ఎక్స్ పొలియేషన్:
చర్మానికి ఎక్స్ పొలియేషన్ చేయడం మంచిది. దీనికోసం సాధారణ కొబ్బరి నూనెలో కొద్దిగా ఉప్పు, పంచదార కలిపి మసాజ్ చేయడం వలన చర్మం లోని మృతి కణాలు తొలగి చర్మం మృదువుగా మెరుస్తుంది. కొబ్బరినూనెలో ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి.
ఇవన్నీ చర్మం లోతుగా చోచ్చుకుపోయి హైడ్రేషన్ ని అందిస్తాయి. ఈ నూనెను అప్లై చేయడం వలన గీతలు తగ్గుతాయి. గాయాలు త్వరగా నయం అవుతాయి..చర్మంపై ముడతలు దూరం; కొబ్బరి నూనెలో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. ఇవి వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. కాబట్టి చర్మం కాంతివంతంగా యవ్వనంగా మారుతుంది.
సన్ బర్న్ తగ్గేందుకు; ఈ నూనెలో శోధన నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఎండకు ఎక్స్పోజ్ అయ్యే శరీర భాగాలను నూనె మసాజ్ చేయడం వలన ఎండ వలన కలిగే సమస్యలు తగ్గుముఖం పడతాయి.
