Belly fat : మీరు బెల్లీ ప్యాట్ తో బాధపడుతున్నారా..? భోజనానికి ముందు వీటిని తాగితే ఈజీగా చెక్ పెట్టవచ్చు..
అయితే ఈజీగా బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్స్ డ్రింక్స్ తప్పకుండా తీసుకోవాలి. వీటితో మంచి రిజల్ట్ పొందవచ్చు.
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే..
శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గితే బరువు తగ్గుతారు. దీనికోసం సరియైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆకలి కంట్రోల్ లో ఉంటుంది.కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు ఈజీగా తగ్గుతారు. అదేవిధంగా జీవక్రియ పెరిగితే బరువుని బ్యాలెన్స్ చేసుకోవచ్చు.
ప్రోటీన్ ఫుడ్స్: ప్రోటీన్ అధికంగా ఉండే చేపలు, గుడ్లు, చికెన్, బీన్స్, టోపు తీసుకుంటే జీవక్రియ మెరుగుపడుతుంది. కార్బోహైడ్రేస్ హైడ్రేట్స్ కొవ్వులతో పోలిస్తే ప్రోటీన్ జీర్ణం అవడానికి అధిక టైం పడుతుంది. అదే విధంగా జీవక్రియ పెరిగి ద్రవ్య రాసిని రక్షించేందుకు కూడా సహాయపడుతుంది.ఇది హెల్తీ జీవ క్రియకు మంచిది.

గ్రీన్ టీ: గ్రీన్ టీ లో కాటేచిన్ టిఫిన్ లాంటి సమ్మేళనాలు ధర్మోజనిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దాంతో క్యాలరీలు బర్న్ అవుతాయి. గ్రీన్ టీ ని భోజనానికి ముందు తీసుకుంటే జీవక్రియ మెరుగుపడుతుంది. తక్కువ కేలరీల గ్రీన్ టీ శరీరాన్ని హైడ్రేట్ చేసి రిఫ్రెష్ గా ఉంచుతుంది.
సూప్ లు: భోజనానికి ముందు వెజిటేబుల్స్ సూప్ తాగడం చాలా మేలు జరుగుతుంది. దీనివలన ఈజీగా బరువు తగ్గుతారు. సూప్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. కావున దీన్ని ఎవ్వరైనా తీసుకోవచ్చు..
మంచి కొలెస్ట్రాల్: భోజనానికి ముందు అవకాడో, నట్స్, అలివ్ ఆయిల్ లాంటి హెల్తీ ఫ్యాట్స్ ని తీసుకుంటే కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన వచ్చి అతిగా తినరు. కొవ్వు జీర్ణం అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. కడుపు నిండుగా ఉంటుంది. దీంతో తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు దాని వలన ఈజీగా బరువు తగ్గుతారు..

అలాగే ప్రతిరోజు రెండు మూడు జ్యూస్ లు తాగడం వలన కూడా బెల్లీ ఫ్యాట్ త్వరగా కరుగుతుంది. పుచ్చకాయ ,గుమ్మడికాయ, పైనాపిల్ లాంటి వాటిని ఇంట్లోనే తయారు చేసుకుని తాగడం వలన ఈ అధిక బరువు బెల్లీ ఫ్యాట్ కి చెక్ పెట్టవచ్చు..
ఈ ఆహార నియమాలతో పాటు ప్రతిరోజు శారీరిక శ్రమ అంటే వ్యాయామం 45 నిమిషాలు వాకింగ్ యోగ లాంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఆయిల్ ఫుడ్స్ కి దూరంగా ఉంటే.. బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాదు మంచి ఆరోగ్యాన్ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు..
