Chanakiya Niti : ఏ భార్య కూడా తన భర్తతో ఈ నాలుగు విషయాలు అస్సలు చెప్పలేదు..

Chanakiya Niti : ఏ భార్య కూడా తన భర్తతో ఈ నాలుగు విషయాలు అస్సలు చెప్పలేదు..

Chanakiya Niti : చాణిక్య నీతి ప్రకారం  ఈ నాలుగు విషయాల గురించి ప్రతి భార్య తన భర్తకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అస్సలు తెలియనివ్వదు. వాటిని ఎప్పటికీ రహస్యంగానే ఉంచాలని అనుకుంటుంది. దాంపత్య జీవితంలో దంపతుల మధ్య ఎలాంటి రహస్యాలు లేకుండా తమ విషయాలను ఒకరితో ఒకరు పంచుకుంటే వారి సంసారం అనేది అన్యోన్యంగా దృఢంగా ఉంటుంది.

అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని రహస్యాలు అనేవి తప్పకుండా ఉంటాయి. అవి చిన్నవి అయినా కావచ్చు.. పెద్దవైన కావచ్చు.. వాటిని ఎవరితోనూ పంచుకోవడానికి వారు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు.. ముఖ్యంగా వాటిని తమ జీవిత భాగస్వామి దగ్గర చెప్పడానికి అస్సలు ఇష్టపడరు.

ఇలాంటి రహస్యాలు స్త్రీ పురుషుల మధ్య సమానంగా ఉన్న పురుషులు ఏదో ఒక సందర్భంలో వాటిని తమ జీవిత భాగస్వామికి చెప్పేస్తారు. కానీ స్త్రీలు మాత్రం వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భర్తకు చెప్పడానికి అసలు ఇష్టపడరని చానక్యుడు చెప్పాడు ఆడవారి మనసుని సముద్రపు లోతుని అంచన వేయడం అంత సులువు కాదని మన పెద్దలు చెప్తూ ఉంటారు.

స్త్రీలు పైకి ప్రశాంతంగా కనిపించిన వారి మదిలో మాత్రం ఎల్లప్పుడూ రకరకాల ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి.  వాటిని పసిగట్టడం అంత ఈజీ కాదు.. స్త్రీలకు ఏదైనా విషయం తెలిస్తే దానిని కడుపులో దాచుకోలేరు. ఏదో ఒక సందర్భంలో ఆ రహస్యాన్ని బయటకు చెప్పేస్తారు. లేకపోతే వారికి మనశ్శాంతి అనేదే ఉండదు.

196 -2

అందుకే ఆడవారి నోటిలో ఆవగింజయినా దాగదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు.. అయితే కొన్ని విషయాల్లో మాత్రం స్త్రీలు ముఖ్యంగా నేటితరం మహిళలు తమ భర్త దగ్గర చాలా గుంబనంగా ఉంటారు. వాటి గురించి తమ భర్తకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పడానికి ఇష్టపడరు. తమ రహస్యాలు గురించి భర్తకు అస్సలు అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు.

ఆ విషయాలు తమ భర్తకు తెలిస్తే తమ దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు వస్తాయో అని కంగారుపడుతూ ఉంటారు. మరి భార్య భర్త దగ్గర దాచే ఆ నాలుగు రహస్యాలు ఏంటంటే ముఖ్యంగా భార్య భర్త దగ్గర దాచే మొదటి రహస్యం. పూర్వపు ప్రేమ.. దీని గురించి ఏ భార్య భర్త దగ్గర చెప్పడానికి అస్సలు ఇష్టపడదు.  

అది సహజ కొంతమంది తమ ఇష్టాన్ని తాను ప్రేమించిన వ్యక్తితో పంచుకుని ప్రేమ వివాహారం నడిపితే మరికొందరు మాత్రం తమ ఇష్టాన్ని మనసులోనే దాచుకుని బయటకు చెప్పకుండా అలానే ఉంటారు. ఏ స్త్రీ కూడా పెళ్లికి ముందు ఉన్న ప్రేమ వ్యవహారాన్ని తమ భర్తకు చెప్పడానికి అస్సలు ఇష్టపడదు. ఇక రెండవది ఇంట్లో కుటుంబ నిర్ణయాలు..

ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక విషయంలో భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. ఇది సహజం ఈ విషయంలో ఇద్దరిలో ఒకరు వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ శాతం స్త్రీలు ఇక చేసేదేం లేక తమ భర్త నిర్ణయానికి ఎదురు చెప్పలేక తమకు ఇష్టం లేకపోయినా సరే ఆ నిర్ణయాన్ని సమర్థిస్తారు.

196 -3

తమ భర్త నిర్ణయానికి ఎదురు చెబితే ఆయన ఎక్కడ బాధపడతారు అని అనుకుని అది తనకు నచ్చకపోయినా సరే దానికి సమ్మతి తెలిపి తమలో తాము బాధపడుతూ ఉంటారు. ఇక మూడవది డబ్బు... విషయంలో మహిళలు చాలా గుమ్మనంగా ఉంటారు.

ప్రతి స్త్రీ తమకు పుట్టింటి వారు ఇచ్చినవో లేదా పాలు పెరుగు అని కూడబెట్టినవో ఇలా ఏదో ఒక విధంగా సమకూర్చుకున్న డబ్బుని తమ భర్తకు తెలియకుండా దాపరికం చేస్తూ ఉంటుంది. తమ భర్తకు ఆ డబ్బు ఎక్కడ కనబడితే వాడేస్తాడు అని అది ఏదో ఒక అత్యవసరంలో ఉపయోగపడుతుందని భర్తకు తెలియకుండా చాలా రహస్యంగా దాచిపెడుతూ ఉంటుంది.

ఇక నాలుగవది చాలామంది స్త్రీలు తమ అనారోగ్యం గురించి భర్తకు పెద్దగా తెలియనివ్వరు. తమ సమస్య చిన్నదే కదా తగ్గిపోతుందిలే అని అనుకుని తమలో తాము సర్ది చెప్పుకుంటూ తమ భర్త పైన భారం మోప లేక వారిలో వారి తమ అనారోగ్యం గురించి దాచేస్తూ ఉంటారు..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?