Coconut water : సమ్మర్ లో కొబ్బరి నీళ్లు తాగుతున్నారా.. అయితే ఏ టైంలో తాగాలో తెలుసా..?
వేసవిలో దీనిని తాగటం వలన చాలా కాలం పాటు శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.తక్షణ శక్తి కోసం ఎన్ని పానీయాలు తాగిన కొబ్బరి నీళ్ళు లాగా రిఫ్రెష్ శక్తినిచ్చే పానీయాలు మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. సమ్మర్ లో రకరకాల సీజనల్ ఫ్రూట్స్ మనకు దొరుకుతూ ఉంటాయి.మామిడి పండ్లు, చీమ చింతకాయలు,తాటి ముంజలు ఇలా ఎన్నో రకాల పండ్లు మనకు దొరుకుతూ ఉంటాయి.

వేసవిలో డిహైడ్రేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. కొబ్బరి నీళ్లు, దోసకాయ లాంటి వాటిని తీసుకోవడం చాలా మంచిది.. ఆరోగ్య నిపుణుల చెప్పి దారి ప్రకారం కొబ్బరి నీరు శరీరానికి ఎలక్ట్రోలైట్ ను వెంటనే అందించేందుకు పనిచేస్తాయి.
అలాగే రక్తంలో చక్కెరను కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే చాలామంది కూడా సమయపాలన అనేది లేకుండా ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు.కొబ్బరి నీళ్లు తాగడంలో సమయపాలన చాలా అవసరం అని అంటున్నారు నిపుణులు.
దాని వలన మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చు అని అంటున్నారు. సమ్మర్ లో కొబ్బరి నీళ్లను ఏ టైంలో తాగాలనే విషయం చాలా మందికి తెలియదు. కొంతమంది అయితే ఖాళీ కడుపుతో తీసుకుంటే, మరి కొందరు మధ్యాహ్నం తాగటం మంచిదని భావిస్తారు. ఈ విషయంపై జైపూర్ కు చెందినటువంటి డైటీషియన్ కొన్ని సూచనలు చేశాడు.

కొబ్బరి నీళ్లలో భోజనం చేసిన తర్వాత కానీ,భోజనంతో కానీ అస్సలు తాగకూడదు అని అన్నారు.గుండెల్లో మంట సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగటం వలన మంచి ఫలితం ఉంటుంది అని అన్నారు.ఖాళీ కడుపుతో ఈ హెల్త్ డ్రింక్ తాగటం వలన కూడా జీవక్రియ పెరుగుతుంది.
బరువును కూడా తగ్గిస్తుంది. కొబ్బరి నీళ్లు ఉదయం వేళలో తాగినట్లయితే మరింత ప్రయోజనాకరం అంటున్నారు. కడుపు ఆరోగ్యంగా ఉంటే శరీరం ఎన్నో వ్యాధులు లేక ఆరోగ్య సమస్యల నుండి రక్షించబడుతుంది.కావాలంటే నిపుణుల సలహా మేరకు మధ్యాహ్నం టైంలో కూడా తాగవచ్చు.
