Conasima Coconut juice : సమ్మర్ కోనసీమ స్పెషల్ డ్రింక్... ఫ్రెష్ కోకోనట్ జ్యూస్.. హెల్తీ... సూపర్ టేస్టీ...
కొబ్బరి నీళ్లు మిమ్మల్ని హైబ్రిడ్ గా ఉంచి ఆరోగ్యకరమైన జ్యూస్ ఇవి రోజూ తాగుతూ ఉంటే కడుపు చర్మం శారీరిక ఆరోగ్యానికి ఎంతో మేలు వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు చాలామంది తాగే డ్రింక్. కొబ్బరినీళ్లు ఈ నీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిలో తక్కువ క్యాలరీలు. తక్కువ చక్కెరతో ఆరోగ్యకరమైన పానీయం. ఇది శరీరాన్ని ఎప్పుడు హైడ్రేట్ గా ఉంచుతుంది.
ఈ కొబ్బరినీటిలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అవి శరీరంలో అధిక ద్రవాలను నియంత్రించడంలో సహాయపడే ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు విపరీతంగా చెమట పట్టే వారికి సహాయకారిగా ఉంటుంది. రక్తపోటును కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది చాలా బాగా సహాయపడుతుంది.
వేసవికి ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని అక్కడి నిర్వాకులు జ్యోతి తెలిపారు. తమ కళ్ళ ముందే కొబ్బరికాయ కొట్టి నీటితో గుజ్జుతో జ్యూస్ చేసి కాస్త గ్లూకేజ్ వేసి ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుందని ఆమె చెప్పారు.

ఇక్కడ కోకోనట్ జ్యూస్ ఒక గ్లాసు 50 రూపాయలు. అర లీటర్ నీళ్లు 80 రూపాయలు. లీటరు 160 రూపాయలు అమ్ముతూ ఉంటారు. ఎవరికైనా కోకోనట్ జ్యూస్ కావాలనుకుంటే తమ వద్దకు వస్తే మంచి రుచికరమైన జ్యూస్ చేసి ఇవ్వడం జరుగుతుందని వారు తెలుపుతున్నారు..
స్పెషల్ సమ్మర్ జ్యూస్:
విశాఖపట్నంలోని లెసన్స్ కాలనీ వద్ద కోనసీమ నుండి తీసుకువచ్చిన కొబ్బరికాయలతో ఈ జ్యూస్ చేసి అమ్ముతూ ఉంటారు. కోనసీమ వారి కోకోనట్ జ్యూస్ నిర్వాహకులు నగరవాసులు కళ్ళముందే కొబ్బరికాయ కొట్టి నీళ్లు తీసి ఆ కొబ్బరికాయలు మెత్తటి గుజ్జు కూడా దాంట్లో వేసి ఎండ తీవ్రతకు తట్టుకునే విధంగా కొంచెం గ్లూకోజ్ వేసి మిక్సీ పట్టి అప్పటికప్పుడే చల్ల చల్లగా ఇస్తూ ఉంటారు.
