Stomach Worms : కడుపులో నులి పురుగులను ఎలా తొలగించాలో తెలుసా..
ఈ లక్షణాలతో ఎక్కువగా బాధపడుతుంటారు. అయితే పొట్టలో ఉన్న నులిపురుగులు లేక నట్టలు లేక ఎలికపాములు ఇవన్నీ కూడా పొట్టలోకి ఎలా చేరుతాయి. అవన్నీ ఎన్ని రకాలు. ఏ విధంగా వాటిని తొలగించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మురుగు నీరు ఉన్న ప్రాంతాలు మరియు మరుగుదొడ్ల వలన కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. సరిగ్గా ఉడకని మాంసం మరియు పురుగు పట్టిన చేపలు తినడం వలన మీ పెంపుడు జంతువులకు కూడా పొట్టలోకి చేరతాయి. చాలా మంది చిన్న పిల్లల్లో ఎక్కువగా ఈ నులిపురుగుల ఇన్ఫెక్షన్లు వస్తాయి.
పొడవైన తాడుల గా ఉండే ఈ పురుగుల గుడ్లు అనేవి కడుపులోకి చేరి అవి అక్కడ పెరుగుతాయి. తర్వాత ఇవి మలద్వారం వద్ద గుడ్లు పెడతాయి. అప్పుడు అవి చేతులకు అంటుకుంటాయి. ఆట బొమ్మలు మరియు దుస్తులు, బాత్రూం నేల, వంటగది,పడకగది మరియు ఆహారంలోకి ఈ గుడ్లు అనేవి వ్యాప్తి చెందుతాయి..
పొట్టలోకి ఈ గుడ్లు చేరిన తర్వాతఅవి లార్వాగా ఏర్పడతాయి. ఒకటి లేక రెండు నెలల్లోనే అవి పొడవైన క్రిములుగా మారతాయి. దీనికి సంబంధించి ఒక సారి చికిత్స తీసుకున్న తర్వాత కూడా పిల్లలు మళ్లీ అలాంటి ప్రదేశాలకు వెళితే, ఈ ఇన్ఫెక్షన్ అనేది మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. కావున పిల్లలు ప్రతిరోజు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.
చిన్నపిల్లలకి ఎప్పుడు చేతులు కడుక్కునే అలవాటు చేయాలి. కడుపులో ఉన్నటువంటి ఈ నులిపురుగులను ఎలా తొలగించాలి అంటే. ప్రతి ఒక్కరు కూడా చేతులను చాలా శుభ్రంగా కడుక్కోవాలి. గోళ్లను కూడా కత్తిరిస్తూ ఉండాలి. తినటానికి ముందు మరియు టాయిలెట్ కి వెళ్లి వచ్చిన తర్వాత పిల్లలకు డైపర్లు మార్చిన తర్వాత కూడా చేతులు చాలా శుభ్రంగా కడుక్కోవాలి.
పిల్లలకు తరచుగా చేతులు కడుక్కునే అలవాటు చెయ్యటం మంచిది. చిన్నపిల్లలకు ప్రతిరోజు కూడా స్నానం చేయించడం చాలా మంచిది. పళ్ళు తోముకోవడానికి ముందు మరియు తరువాత బ్రష్ కూడా చాలా శుభ్రంగా కడుక్కోవాలి. వేడి నీళ్లతోనే ఎక్కువగా టవల్ ను, బెడ్ షీట్ లను ఉతికితే చాలా మంచిది. పిల్లలు ఆడుకునే బొమ్మలను కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి.
వంట గదులను మరియు బాత్రూమ్ లను కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ క్రిములను ఎలా తొలగించాలి అంటే. క్రిములా కారణంగా పిల్లల్లో మరియు పెద్దల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అని వైద్యులు చెబుతున్నారు. కావున సంవత్సరానికి రెండుసార్లు అయినా వైద్యుల సలహా మేరకు క్రిమి నివారణ మందులను తీసుకుంటే మంచిది.
చిన్నపిల్లలకు రెండు సంవత్సరాలు దాటినప్పుటి నుండి ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ చెయ్యొచ్చు. ఈ పక్రియలో శరీరంలోని ఈ నులి పురుగులు బయటకు వెళతాయి అని వైద్యులు తెలిపారు..