Indoor plant : ఈ మొక్కల ముందు ఏసీ ఫ్యాన్  లు కూడా పనికిరావు..

 Indoor plant : ఈ మొక్కల ముందు ఏసీ ఫ్యాన్  లు కూడా పనికిరావు..

Indoor plant : ప్రస్తుతం సమ్మర్ సీజన్ అయితే నడుస్తుంది.సూర్యుడు మాత్రం ఉదయం 10 గంటల నుండే తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెడుతున్నాడు. భానుడి భగభగ లకు జనం అల్లాడిపోతున్నారు. రాబోతున్న ఒకటిన్నర నెలలు వరకు సూర్యుని వేడి తాపం నుండి ఉపశమనం కలిగేలా లేదు. 

సమ్మర్ లో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఇంట్లో కూడా ఎంతో ఉక్క పోతగా ఉంటుంది. చెమటలు కూడా ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఇలాంటి టైం లో ఏసీ, కూలర్లు,ఫ్యాన్ లు ఎక్కువగా వాడుతూ ఉంటాము. అయితే మీ ఇంటి ని సహజంగా చల్లగా మార్చుకోవటానికి ఏసీలు, కూలర్లు కన్నా చౌకైనా మార్గాల గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా.

లేదు కదా. నిజమే అవి మీ ఇంటిని అందంగా ఉంచడమే కాకుండా ఇంటిని కూడా చల్లగా ఉంచటంలో  ఎంతో సహాయపడతాయి. కొన్ని రకాల మొక్కలు ఇంట్లో ఉన్నట్లయితే ఈ మొక్కలు ఇంట్లో ఉన్న వేడి గాలిని కూడా చల్లగా మారుస్తుంది..

163 -1
వేసవిలో కలబంద చర్మాన్ని చల్లగా ఉంచడమే కాకుండా ఎలాంటి వడదెబ్బ లేక టా నింగ్ నుండి రక్షించడానికి ఎంతో సహాయపడుతుంది. అందుకే కలబంద మొక్కని ఇంటి లోపల ఉంచితే ఈ మొక్క ఇండోర్ గాలి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఎంతో ప్రాచుర్యం పొందిన లివింగ్ రూమ్ మొక్కలలో అరేకా ప్లాంట్ ఒకటి. ఇది ఒక అలంకారమైన ఇండోర్ ప్లాంట్. ఇది చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది.

ఇది సహజ హ్యూమెక్టెంట్ గా కూడా పనిచేస్తుంది. అనగా ఇండోర్ గాలిని సహజంగా తేమగా మార్చటానికి ఇది ఎంతో ఉత్తమమైనది కూడా. ఇంటి లోపల నుండి చల్లగా ఉంచడమే కాక ఫార్మల్డి హైడ్, బెంజిన్ లాంటి ఎన్నో విష పదార్థాలు గాలిలో తొలగించటానికి సహాయపడుతుంది. చైనీస్ ఎవర్ గ్రీన్ మొక్క చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది.

పేరుకు తగ్గట్టుగానే చైనీస్ ఎవర్ గ్రీన్ మొక్క ఎప్పటికీ ఆకుపచ్చగానే ఉంటూ ఇంటిని చల్లగా ఉంచుతుంది.ఇంట్లో వేడి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ మొక్కలను పెంచుకుంటే చాలా మంచిది. ఈ మొక్కలు వేడిగాలని పీల్చుకొని   వాతావరణాన్ని చల్లబరుస్తుంది..

163 -2
రబ్బర్ ప్లాంట్ ఈ మొక్కకు పెద్దపెద్ద ఆకులు ఉంటాయి. ఇది ఎక్కువగా చల్లదనాన్ని ఇస్తుంది.ఈ మొక్క ఉండే నేల మరీ పొడిగాను మరీ తడిగాను లేకుండా చూసుకోవాలి. నీళ్లను ప్రతిరోజు తక్కువ మోతాదులో పోస్తూ ఉండాలి. స్పైడర్ ప్లాంట్ పేరు కొద్దిగా విచిత్రంగా అనిపించిన ఈ మొక్కను మాత్రం మీరు ఈజీగా పెంచుకోవచ్చు. మీరు ఈ మొక్కను ఎలా ఉంచినా కూడా అది హాయిగా పెరుగుతూ ఉంటుంది.

ఇంట్లో వేడి కచ్చితంగా తగ్గాలి అనుకునే వారు ఈ మొక్కను మీ ఇంట్లో ఉంచుకోండి. ఫొథోస్ లేక డెవిల్స్ మొక్క ఇది మనీ ప్లాంట్ జాతికి చెందినది. ఈ మొక్క కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పట్టాల్సిన అవసరం కూడా లేదు.చిన్న మొక్క నాటితే చాలు దానంతట అదే పెరుగుతూ ఉంటుంది. ఈ మొక్కల ఆకులు హృదయ ఆకారంలో ఉంటాయి. ఇది ఇంటిని కూడా చల్లగా ఉండేలా చేస్తుంది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?