Happyness: మనిషి సంతోషంగా జీవిస్తూ ఉండాలంటే కచ్చితంగా ఇవి పాటించాల్సిందే?
ఇంకొంచెం పెద్దయ్యాక చదువు కాలంలో చదువు అర్థం కాక లేదా మైండ్ కి ఆ చదువు ఎక్కలేక నాన్న తిప్పలు పడుతూ ప్రశాంతంగా ఉండలేడు. అలాగే పెరిగి పెద్దయ్యాక జాబ్ రాలేదని ఇంకొంచెం పెద్దయ్యాక పెళ్లి కాకపోతే పెళ్లి కాలేదని అలాగే పెళ్లయ్యాక పిల్లలు పుట్టకపోతే పుట్టలేదని, ఒకవేళ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పోషించలేక ఇబ్బంది పడడం ఇటువంటివి సహజంగానే మనం ప్రతిరోజు కూడా చిన్నచిన్న కష్టాలు వల్లే మనుషులు సంతోషంగా ఉండలేకపోతున్నారు.
ప్రతి మనిషి కూడా తన జీవితకాలం మొత్తం ఆనందంగా ఉండాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు ఫ్యామిలీ పరంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. మరికొందరు ఫ్యామిలీలలోనే ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా సమస్యలతో గొడవలతో ఇప్పుడు కూడా మనశ్శాంతికి గురవుతారు. కాబట్టి ఇలాంటి సమయంలోనే కొన్ని సూచనలు అనేవి పాటిస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క జీవితంలో కొంచెం సమయమైనా ఆనందంగా గడపగలుగుతారు.
మనం ఎంత అనుకున్నా జీవితకాలం మొత్తం ఆనందంగా గడపాలంటే అది అయ్యే పని కాదు. అయితే మీరు కచ్చితంగా సంతోషంగా ఉండాలంటే కొన్ని వదిలేయాల్సి ఉంటుంది. మొదటగా మీకు సూట్ అవ్వని విషయాలు ఏమైనా ఉంటే అవి పట్టించుకోకపోవడం బెటర్. మీ జీవితకాలంలో ఎవరైనా సరే మిమ్మల్ని తక్కువగా చూస్తే వాళ్ళని అసలు పట్టించుకోకూడదు.
అలా పట్టించుకున్నావంటే కచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక సమస్యకి గురవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో అంటే గతంలో ఏదో ఒక ఘటన మర్చిపోలేనటువంటిది జరిగే ఉంటుంది. ఆ ఘటనలనేది మనం మర్చిపోగలిగితేనే జీవితంలో ఆనందంగా ముందుకు సాగగలం. వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. ఎప్పుడైతే మనం ఎదుటి వారిపై ద్వేషం అనేది పెట్టుకుంటామో అప్పుడు మానసిక సమస్యలకు లోనవాల్సి వస్తుంది.
కాబట్టి ఎప్పుడూ కూడా ఎదుటి వారిపై ద్వేషం అనేది పెట్టుకోకూడదు. ఇది పూర్తిగా మానేయాలి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం అనేది మీరు జీవితం లో ఎప్పుడూ కూడా చేయకండి. అప్పుడు మనం అవతలి వారి వద్ద చులకన అయిపోతాం. కాబట్టి మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేసుకోకండి. ఇలా చేయగలిగితేనే జీవితంలో ముందుకి ఆనందంగా గడపగలం.
అలాగే మీ చుట్టుపక్కల జరిగినటువంటి విషయాలు లేదా మీ ఇంట్లో జరిగినటువంటి విషయాలనేవి ఎప్పుడు కూడా బయటకు చెప్పుకోకండి. ఎందుకంటే అవతలి వారు మనకి నచ్చిన వాళ్ళ అయ్యుండొచ్చు లేదా నచ్చని వాళ్ళు అయినా ఉండవచ్చు. కాబట్టి మనము మానసిక క్షోభకు గురయ్యా ఎటువంటి అవకాశం ఉంది. తద్వారా మనం జీవితంలో ఆనందంగా గడపలేము.
కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని అలవాటులను మానుకోవడం వల్ల కూడా ఆనందంగా గడపవచ్చు. అయితే ఇవన్నీ నేను మీకు చెప్పినంత సులభం అయితే మాత్రం కాదు. కచ్చితంగా వీటిని మీరు అనుసరిస్తేనే సంతోషంగా గడపగలరు. మీరు మీ జీవితంలో ఏదైనా సాధించాలంటే అవతలి వారిని అసలు పట్టించుకోకూడదు. ఇప్పుడైనా సరే మన పని మనం చేసుకుంటూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటూ జీవనాన్ని సాగిస్తే ఎవరి జీవితంలోనో పెద్దగా సమస్యలు లేదా కష్టాలనేవి ఉండవు. దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తెలియని లోపం అనేది మీలో ఉంటుంది.
కాబట్టి అది ఏంటో మీరే గుర్తు చేసుకొని ఆ అలవాట్లు అనేవి మానుకొని ముందుకు సాగిస్తే మంచిది. అప్పుడే మనం జీవితంలో అన్ని సాధిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ జీవితాన్ని ఆనందంగా గడపగలం. కాబట్టి జీవితంలో ఏదైనా సాధించాలి లేదా సంతోషంగా ఉండాలంటే కొన్ని చెడు అలవాట్లు వదులుకోవాలి అలాగే మంచి వ్యక్తులతో స్నేహం చేయాలి. మంచి అలవాటులను కూడా అలవరుచుకుంటూ అందరితో ఆప్యాయతతో నడుచుకోవాలి. ఎవరి మీద అయినా సరే ఎక్కువగా కోపం అనేది చూపించకూడదు.
అలాగే వీటన్నిటితో పాటుగా మనం జీవితం మొత్తం ఆనందంగా ఉండాలంటే మొదటగా పోషకాలు సరిగ్గా ఉండేటువంటి ఆహారాన్ని తినాలి. అలాగే ప్రతిరోజు ఆరోగ్యంగా కూడా ఉండాలంటే వ్యాయామం కూడా చేయాలి. ఇలా ఎప్పుడైతే మనం చేస్తామో ఒకవైపు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది మరోవైపు ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. అప్పుడే ఎక్కువకాలం కూడా ఆనందంగా జీవించగలం.