Headaches Causes : తలనొప్పి మ‌ళ్లీ మ‌ళ్లీ వస్తుందా...?  ఎప్ప‌టికీ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

Headaches Causes : తలనొప్పి మ‌ళ్లీ మ‌ళ్లీ వస్తుందా...?  ఎప్ప‌టికీ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

Headaches Causes :  భూమ్మీద నివసించే ప్రతి ఒక్క మానవుడు ఒకసారి అయినా సరే తలనొప్పికి గురువాల్సిందే. సాధారణంగా మానవులనే వాళ్లు ప్రతి రోజు ఉదయం లేవగానే ఏదో ఒక  పనికి వెళ్తూ తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఇలా ఏదో ఒక పనిలో పూర్తిగా లీనమై  పనిచేస్తున్న వాళ్ళను కూడా మనం చూస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మనిషి బ్రతకాలంటే కచ్చితంగా ఏదో ఒక పని చేయాల్సిందే. ఇలాంటి సందర్భాల్లోనే చాలామంది తలనొప్పి గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. 

 ప్రస్తుతం చిన్నపిల్లలు అని లేదు పెద్దవాళ్ళు అని లేదు ప్రతి ఒక్కరికి కూడా తలనొప్పి అనేది కామన్ గా మారిపోయింది. చాలామంది అయితే చిన్నపిల్లలు తలనొప్పి లేకపోయినా తలనొప్పి అని చెప్పేసి   స్కూళ్ళకి వెళ్లకుండా ఉన్న రోజులు కూడా చాలానే ఉన్నాయి. అయితే చాలామందికి తలనొప్పి అనేది చాలా విపరీతంగా వస్తూ ఉంటుంది. దీనివల్ల అనేక సందర్భాల్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే మనం కొన్ని చెప్పే చిట్కాలు వల్ల  తలనొప్పి అనేది రాకుండా చేసుకోగలం. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 ప్రస్తుత రోజుల్లో జాబ్ చేసే ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ల ముందు కూర్చుంటూ  కనురెప్పలు కూడా కొట్టకుండా కంప్యూటర్ను చూస్తూనే  పనులనేవి చేస్తూ ఉంటాం. దానివల్ల మెదడు అనేది ఇబ్బంది గురై తీవ్రమైన తలనొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని చిట్కాలు ద్వారా వాటిని సులభ తరంగా తగ్గించుకోవచ్చు. 

 కంప్యూటర్ ముందు కూర్చునేటువంటి వారికే ఎక్కువగా తలనొప్పి అనేది వస్తుంది. కాబట్టి వాళ్లకి కొన్ని చిట్కాలు అయితే ఉన్నాయి. ఈ కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే వాళ్లు కచ్చితంగా యాంటీ గ్లారే గ్లాసెస్ వాడడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అలాగే కనురెప్పలు ఆర్పకుండా పనిచేయడం సరికాదని , కొంచెం సేపు తర్వాత అయినా ప్రతి అరగంటకి లేదా గంటకి కంప్యూటర్ నుంచి దూరంగా వెళ్లి ఒక పది నిమిషాల పాటు విశ్రాంతి తీసుకొని వచ్చి మళ్ళీ పని చేసుకోవాలని నిపుణులు చెప్పుకొస్తున్నారు. 

06 -22
 ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది అమ్మాయిలు కుట్టు మిషన్లు అనేవి కొడుతూ ఉంటారు. అలాగే మరికొంతమంది ఆడవాళ్లు డిజైన్లు అల్లే సందర్భంలో కళ్ళు ఆర్పకుండా ఉండాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు అదేపనిగా  మాత్రం చేయకూడదట. ప్రతి అరగంటకి లేదా గంటకి బ్రేక్ తీసుకొని మళ్లీ పనులను ప్రారంభించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ప్రస్తుతం చాలామంది సువాసనలు వెదజల్లే పర్ఫ్యూమ్స్ వాడుతున్నారు. ఇవి పడని వారు దూరంగా ఉండడమే బెటర్ అని  లేకపోతే కచ్చితంగా తీవ్రమైన తలనొప్పికి లేదా వామ్తింగ్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలని వైద్యు నిపనులు సూచిస్తున్నారు. అలాగే చాలామంది ప్రస్తుతం రోజుల్లో కాఫీ లేదా కెఫిన్ ,  చాక్లెట్స్ వంటి పదార్థాలు అనేవి ఎక్కువగా తీసుకోకూడదు. వీటితోపాటుగా  శీతల పానీయాలు అనేవి కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల తలనొప్పికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిదని చెప్తున్నారు. 

 చాలామంది ఇప్పటికీ కూడా తలనొప్పి తగ్గాలంటే టీ కాఫీలను ఎక్కువగా తాగుతూ ఉంటే విశ్రాంతి కలుగుతుందని అనుకుంటారు. అయితే ఎక్కువ మోతాదులో ఇలాంటివి తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ తలనొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా మీరు అనారోగ్యానికి కూడా గురవాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా సరే  పరిమితులు వాడుకోవాలని వైద్యునిపనులు సూచిస్తున్నారు.

 ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది డీజే కి అలవాటు పడిపోయారు.. అయితే ఈ డీజే వల్ల అంటే ఎక్కువ శబ్దాలు వచ్చేటువంటి వాటి వల్ల  మనకి తలనొప్పి తో పాటు చెవి నొప్పి కూడా తీవ్రంగా కలుగుతుందంట. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్తున్నారు. 

06 -24
 మానవుడు ప్రతిరోజు కనీసం 8 గంటలైనా సరే నిద్ర పోవాలి. లేదంటే కచ్చితంగా తలనొప్పి కాకుండా మరిన్ని అనారోగ్యాలకు గురవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఎనిమిది గంటల పైన నిద్రపోయిన  అంటే దాదాపు ఇంకా ఎక్కువ సమయం పాటు నిద్రపోయినా సరే తలనొప్పి వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. కాబట్టి పరిమితిని మించకుండా మన సౌకర్యం లో మనం నిద్రపోవాలి. 

 ప్రస్తుత సందర్భాల్లో కుటుంబాలు ఎక్కువగా ఇతర కారణాల వల్ల గొడవలు పడడం వల్ల మనశ్శాంతికి గురై తలనొప్పి తెచ్చుకుంటున్నారు. వీటివల్ల కుటుంబం మొత్తం కూడా ఇతర అనారోగ్యలకు కూడా గురవ్వాల్సి వస్తుంది. ఎవరితోనూ కూడా ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా శాంతంగా మన పని మనం చేసుకోవడం వల్ల ఈ తలనొప్పి తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. 

అయితే మనిషికి ప్రతిరోజు కనీస విశ్రాంతి అనేది కచ్చితంగా ఉండాలి. ప్రతిరోజు ఏదో ఒక పని నిమిత్తం బయటకు వెళ్లి ఏదో ఒక ఆలోచనతో ఇంటికి వచ్చి  అదే ఆలోచిస్తూ  పదేపదే ఆలోచనతో బాధపడుతూ తలనొప్పికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు తలనొప్పికి దూరమయ్యే అవకాశం ఉంది. 

06 -23

 ఒకవేళ మీకు పదేపదే తలనొప్పి కనుక వచ్చినట్లయితే కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ని కన్సల్ట్  చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి విపరీతమైన తలనొప్పితో ఉన్నా సరే మనం పట్టించుకోకుండా ఉంటాం. ఏదోలే తగ్గిపోతుందిలే అని అలా ఉండకుండా  అంతే మాత్రం ఉండకండి. ఎందుకంటే పదేపదే కానుక తలనొప్పి వచ్చినట్లయితే మనకి ఒక్కొక్కసారి క్యాన్సర్ ఉన్నట్లు కూడా తెలియకపోవచ్చు. 

ఎందుకైనా మంచిది కచ్చితంగా డాక్టర్ని కలిసి వాళ్ళు చెప్పిన దానికి తగ్గట్లుగా నడుచుకోవడమే బెటర్ అని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఒకసారి తలనొప్పి వచ్చి తగ్గిపోతే మాత్రం ఏం కాదు. అదే పదేపదే మాత్రం కనుక వస్తే కచ్చితంగా డాక్టర్ని కలవాలి. డాక్టర్లు ఇచ్చే సూచనల ప్రకారం నడుచుకోవాలి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?