radish : ముల్లంగిని ఎందుకు తీసుకోవాలి? ప్రయాజనాలు ఇవీ..
ముల్లంగి ఒక కూరగాయ మాత్రమే అనుకుంటే పొరపాటే.. ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని మనం తింటుండాలి. పెద్దవాళ్లు చాలా మందికి అర్ష మొలలు, ఉబ్బసం, కిడ్నీలో రాళ్లు, దగ్గు, ఆస్తమా, ముక్కు, చెవి, గొంతు నొప్పులతో బాధపడుతుంటారు. ముల్లంగిలో గ్లూకోసైడ్, ఎంజైములతోపాటు ఆకలిని పెంచుతుంది. మలబద్ధకాన్ని దూరం చేసే గుణాలు ముల్లంగిలో ఉన్నాయి. ఆహారం జీర్ణం కాకుండా ఇబ్బంది పడేవారు భోజనం చేసిన తర్వాత ముల్లంగిలో మిరియాల పొడి కలిపి తినేయాలి. ముల్లంగిని చిన్న చిన్న ముక్కలు చేసి, అందులో మిరియాల పొడి, నిమ్మరసం వెయ్యాలి. కాస్త ఉప్పు కూడా వేసుకొని రోజుకు మూడు పూటలు తింటే చాలు. మలబద్ధకం, అర్ష మొలలు, ప్లీహం, కామెర్లు వంటి సమస్యలు దూరమవుతాయి. విటమిన్లు, పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే ముల్లంగి ఆకుల్ని నీటిలో ఉడకబెట్టి అందులో నాలుగైదు నిమ్మరసం చుక్కలు వేసి తాగితే మూత్ర సంబంధ మంట తగ్గుతుంది.

ఊపిరి తిత్తుల్లో ఏదో సమస్య ఉన్నట్లు మాటిమాటికీ దగ్గుతూ ఉండేవారు బ్రాంకైటిస్ అనే సమస్య ఎదుర్కొంటున్న వాళ్లు ముల్లంగి జ్యూస్‌లో కొద్దిగా తేనె కలిపి తాగేయాలి. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఉదయాన్నే ఇలా చేస్తే అవి కరిగిపోతాయి. పైల్స్ లేదా హేమోరాయిడ్స్‌తో బాధపడేవారు ముల్లంగిని తప్పకుండా తినాలి. మూలశంఖ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ 100 గ్రాముల ముల్లంగిని తినాలి. ముల్లంగిని ముక్కలుగా కట్ చేసి 1 టేబుల్ స్పూన్ తేనెతో తినాలి. ముల్లంగి రసంలో చిటికెడు రాతి ఉప్పు కలిపి తాగితే సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. క్రూసిఫెరస్ కూరగాయలు శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. క్యాన్సర్ కణితుల పెరుగుదలను నిరోధించడంలో ముల్లంగి బాగా ఉపయోగపడుతుంది. ఈ ముల్లంగి క్రూసిఫరస్ కూరగాయల వర్గానికి చెందినది. దీనిని తినడం వల్ల క్యాన్సర్ ముప్పు తప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది.