Kidney Stones : మీలో ఈ సమస్యలు ఉన్నాయా..? అయితే మీ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లే..
ఒకవేళ నిజంగానే మన శరీరంలో స్టోన్స్ ఉన్నట్లయితే వాటి లక్షణాలు ఎలా ఉంటాయో.వాటిని మనం ఎలా గుర్తించాలి. ఏమాత్రం కూడా టెన్షన్ పడకుండా ఆ రాయిని ఎలా కరిగించాలి. ఇలా తనదైన శైలిలో ఆ ఉమ్మడి జిల్లాలో గల ఒక ప్రముఖ వైద్యుడు దీని గురించి వివరించారు. దాని గురించి ఒకసారి చూద్దాం..

వాటిని ఎలా గుర్తించాలి. అనే దాని గురించి వివరించారు. ప్రత్యేకంగా చెప్పాలంటే. మన శరీరంలో రాయి ఉందని గుర్తించడానికి మన నడుము ఉన్నట్టుండి ఒక్కసారిగా భరించలేని నొప్పి వస్తుంది అని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా మరికొందరిలో ఈ రాళ్లు ఉంటే వాంతులు కూడా అవుతాయి. మరి కొందరికి టాయిలెట్ కు వెళ్లిన టైంలో రక్తం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి..
మనం చిన్నపాటి టెస్టు ద్వారా మన శరీరంలో ఈ రాయి ఎక్కడ ఉంది అని గుర్తించొచ్చు. తరువాత మందుల ద్వారా కూడా తగ్గించవచ్చు. మరి సివియర్ అయితే తప్ప ఆపరేషన్ జోలికి వెళ్ళము అని వైద్యులు తెలిపారు. ఆడపిల్లలకి ఈ మధ్యకాలంలో ఈ స్టోన్స్ రావటానికి కొన్ని కారణాలు కూడా వైద్యులు తెలిపారు. నీళ్లు తాగటం తగ్గించటం వల్ల ఈ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ కాలం, ఆ కాలం ఎండాకాలం అనే తేడాలు లేకుండా ఎప్పుడు నీళ్లు ఎక్కువగా తాగటం వలన స్టోన్స్ మాత్రమే కాదు ఏ వ్యాధి మన దరి చేరదు అని వైద్యులు తెలిపారు. వీటితో పాటుగా చాలామందికి మూత్రకోశ సమస్యలు అనగా మూత్రం ఎప్పటిలాగా రాకపోవటమే కాక రాత్రి నిద్ర పోకుండా ఎక్కువసార్లు కూడా పోవటం వంటి లక్షణాలు ఉంటాయి. ఇటువంటి సమస్యలను మనం త్వరగా గుర్తించి కేవలం మెడిసిన్ తో తగ్గించుకోవచ్చు.
ఇవి ముదిరితే మాత్రం సర్జరీ చేయించుకోవలసి ఉంటుంది అని వైద్యులు తెలిపారు. ఏది ఏమైనా సరే ఈ రెండు సమస్యలలో ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే వైద్యుల్ని సంప్రదించండి. ప్రత్యేకంగా చెప్పాలంటే నీళ్లు ఎక్కువగా తీసుకున్నట్లయితే సగం సమస్య పరిష్కారం అయినట్లే. తర్వాత కూడా ఇదే సమస్య ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించి అతి తక్కువ సమయంలోనే వారి సమస్య పరిష్కరించవచ్చు అని వైద్యులు తెలిపారు..
