morning walking : మార్నింగ్ వాక్ ఇలా చేస్తేనే ఎక్కువ‌ బెనిఫిట్స్‌..

morning walking : మార్నింగ్ వాక్ ఇలా చేస్తేనే ఎక్కువ‌ బెనిఫిట్స్‌..

morning walking : నడవటం అనేది ఒక మంచి వ్యాయామం. అయితే ప్రజలు నడుస్తున్నప్పుడు బూట్లు లేక చెప్పులు వేసుకుంటారు. పాదాలు కందిపోతాయని మట్టి అంటుతుంది అని దెబ్బలు తగులుతాయని పుట్ వేర్ వేసుకుంటారు. అయితే బూట్లు కాని చెప్పులు కానీ వేసుకోకుండా ఒట్టి కాళ్లతో నడిచినట్లయితే మంచిది అని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

అయితే ప్రతిరోజు ఉదయం ఒక గంట సేపు చెప్పులు కానీ బూట్లు కాని వేసుకోకుండా నడిస్తే మానసికంగా, శారీరకంగా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి అని తెలిపారు. ఒట్టి  పాదాలతో నడవడం వలన పాదాలు నేరుగా నేలకి తాకుతాయి. దీని వలన రక్త ప్రసరణ శరీర సమతుల్యత  ఎంతో మెరుగు పడుతుంది. కాళ్లు,పాదాలు, మోకాలలోని కండరాలు, స్నాయువులు బలంగా ఏర్పడతాయి.

దీనివలన గాయాల ప్రమాదం కూడా తగ్గుతుంది.ఇసుక, మట్టి,  పచ్చటి గడ్డి లాంటి భిన్నమైన ఉపరితలాలపై చెప్పులు లేకుండా నడవడం వలన పాదాలలో ఉన్న నరాల చివర్లు ఉత్తేజమవుతాయి. దీనివల్ల మెదడు పనితీరుతో పాటు గా మానసిక స్థితి కూడా ఎంతో మెరుగుపడుతుంది..

80 -1
ఉదయాన్నే సూర్యుడి నుండి వచ్చే కిరణాలు చర్మానికి  తాగితే మెలటోనిన్ హార్మోన్ పెరగటం వలన మూడ్ ఇంప్రూవ్ అవుతుంది.శరీరంలో ఉన్న జీవ గడియారం వలన అడ్జస్ట్ అయ్యి స్లీప్ క్వాలిటీ కూడా ఎంతో మెరుగుపడుతుంది. రీప్లేక్స్ పాయింట్లు పాదాలలో ఉంటాయి.

ఈ పాయింట్లో గల కొన్ని కంటికి సంబంధించిన నరాలతో కూడా ఇవి అను సంధానమై ఉంటాయి. చెప్పులు లేకుండా నడవడం వలన ఈ పాయింట్ల పై ఒత్తిడి పెరిగింది. దీనివలన కంటి నరాలకు రక్తప్రసరణ పెరిగే అవకాశం ఉంది. కళ్ళకు ఎక్కువగా ఆక్సిజన్, పోషకాలు అందటం వలన కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.

బేర్ ఫుట్ వాకింగ్ చేసినట్లయితే చిక్కగా ఉన్న రక్తం కూడా పలుచగా మారుతుంది. దీనివలన గుండె ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. కొన్ని అధ్యాయనాల ప్రకారం చూసినట్లయితే అధిక రక్తపోటు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.. గ్రౌండింగ్ అనే పద్ధతి వలన మన శరీరంలో సహజమైన డే నైట్ బయోలాజికల్ రిథమ్ ను రీస్టోర్ చేస్తాయి.

దీని వలన మనసు ప్రశాంతంగా ఉండటమే కాక నిద్ర కూడా బాగా పడుతుంది. ఒట్టి పాదాలతో నడవడం వలన భూమిలోని పాజిటివ్ ఎలక్ట్రాన్లు శరీరంలోకి చేరతాయి. భూమి నెగిటివ్ ఎలక్ట్రాలను గ్రహిస్తుంది. ఇలా జరగటం వలన మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ఇంప్రూవ్ అవుతుంది. శరీరంలోని ఎలక్ట్రాన్లు రిలీజ్ చేయటం వలన రోగ నిరోధక శక్తిని కూడా మేనేజ్ చేయగలదు.

80 -3

భూమికి దూరంగా ఉన్నట్లయితే శరీరంలోని ఇన్ ప్లామేషన్  తో కూడినటువంటి ఎన్నో వ్యాధులు వస్తాయి. రోగ నిరోధక శక్తి కూడా బలహీన పడుతుంది. నేషనల్ ఇన్ స్టి ట్యూట్స్ ఆఫ్ హెల్త్ ప్రకారం చూసినట్లయితే. ఎలక్ట్రాన్ల కొరత వలన మైటోకాండ్రియా బలహీన పడటమే కాక దీర్ఘకాలిక అలసట కూడా వస్తుంది.

చెప్పులు లేకుండా నడవడం వలన శరీరానికి ఎలక్ట్రాన్లు అందించటం వలన కూడా ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. భూమితో డైరెక్టుగా సంబంధం కలిగి ఉన్నట్లయితే గ్రౌండింగ్ అనే పద్ధతి భయం,చింత, ఒత్తిడి లాంటి భావాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది.

గ్రౌండింగ్ ఎక్సర్ సైజుల్లో వేర్ ఫుడ్ వాకింగ్ కూడా ఒకటి. ఇది నిరాశను కూడా తగ్గించేస్తుంది. ఉదయాన్నే ఒక్క పూట ఒట్టి పాదాలతో నడవటం ఒక దినచర్యగా మార్చుకోవటం వలన శరీరం మనస్సు కూడా ఉల్లాసంగా ఉంటాయి.ఈ దినచర్య మొత్తం శ్రేయస్సును పెంచడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?