Over Thinking : ఎక్కువగా ఆలోచిస్తున్నారా... అయితే ఈ జపనీస్ పద్ధతులు పాటించండి..
మనిషి జీవితం ఈ ఉరుకుల పరుగుల కాలంలో ఒత్తిడి మయం అవుతుంది. ఉదయం లేవగానే ఆఫీస్ కి, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి పనుల్లో రోజంతా సరిపోతుంది. ఇక ఆఫీసులో అయితే బాస్ తిట్లు, ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి ఒత్తిడిని పెంచి అతిగా ఆలోచించేలా చేస్తాయి.

మీరు మీ జీవితంలో ఎప్పుడైనా భారంగా అనిపించడం లాంటివి ఫీల్ అయినట్లయితే, చిన్న చిన్న విషయాలకు కూడా వర్రీ అవుతున్నట్లయితే,ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లడం మంచిది. అక్కడ గల పరిసరాలను, వాతావరణం చూసి ఎంచక్కా ఎంజాయ్ చేయండి. అప్పుడు వెంటనే ఈ ఒత్తిడి మీ నుంచి దూరం అవుతుంది.
ఏదైనా మీ నియంత్రణలో లేనట్లయితే దానిని వదిలేయటం చాలా మంచిది. అనగా మీరు నియంత్రించలేని విషయాలపై మీ సమయాన్ని వృధా చేయకపోవడం కూడా చాలా మంచిది. అలాగే వాటిని కూడా అలా వదిలేయకండి. వాటికి బదులుగా మీ జీవితాన్ని మెరుగుపడే సానుకూల పనులు చేయటం మొదలు పెట్టండి. దీనిని జపనీస్ లో షో గానై టెక్నిక్ అని అంటారు..

మన జీవితంలో ఎప్పుడైనా మంచి, చెడు అని రెండు వస్తూ ఉంటాయి. ఏవైనా చెడు సంఘటనల ను సహనంతో, దృఢ సంకల్పంతో ఎదుర్కోవటం చాలా ముఖ్యం. మీరు ఈ సమస్యలతో ఇబ్బందులు పడకుండా దృఢ నిశ్చయంతో, ఓర్పుతో ఎదుర్కోవలసి ఉంటుంది. ఓటమిని అంగీకరించే బదులుగా మీరు ఆ సమస్యలను ఎదుర్కొనే మార్గాలను ఆలోచించాలి.
దీనిని మాత్రం జపనీస్ లో గమన్ టెక్నిక్ అని అంటారు. ఒత్తిడిని తట్టుకొనే విషయంలో అన్నింటికన్నా కూడా ఆధ్యాత్మికత ఎంతో మేలు చేస్తుంది.క్రమం తప్పకుండా మీరు దైవ చింతనలో ఉన్నట్లయితే మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ పద్ధతిని జపనీలు చాలా బాగా ఫాలో అవుతారు. సో మీరు కూడా ఈ పద్ధతుల్ని పాటించినట్లయితే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి..
