Protect kids from summer Tips : వేసవి కాలంలో మీ పిల్లలు జాగ్రత్త.. తల్లిదండ్రులు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
ముఖ్యంగా పగటి పూట 12 గంటల నుండి 4 గంటల మధ్యకాలంలో బయటకు వెళ్ళకూడదు అని ప్రజా ఆరోగ్య శాఖ వారు సూచించారు. ఒకవేళ బయటకు వెళ్ళినట్లయితే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని తెలిపారు. ఈ వాతావరణంలో వేడి తాపం రోజు పెరగటం వలన సమ్మర్ సెలవుల్లో పిల్లలకు ఎక్కువ జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మన శరీరం హిట్ వేవ్ సమయంలో ఎక్కువ నీటిని కోల్పోతుంది. నిర్జలికరణ అనేది చాలా త్వరగా జరిగిపోతుంది. పిల్లల చెమట గ్రంధులు అనేవి పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వలన, పెద్దలతో పోలిస్తే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కొన్ని సమస్యలు వస్తాయి. దీని వలన వారు చాలా ఉక్కిరిబిక్కిరి అవుతారు.
పిల్లలు వేడి తరంగాల టైం లో ఎక్కువ ప్రమాదంలో ఉండేందుకు ఇంకొక కారణం వారి శరీర పరిమాణం. పిల్లల శరీరం అనేది వేడెక్కటం వలన వేడిని గ్రహించే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు శారీరకంగా, చురుకుగా ఉంటారు. ముఖ్యంగా దీనిలో పిల్లలు ఆడుకోవడం,బయటకు వెళ్లడం లాంటివి ఎక్కువగా ఉంటాయి.
అయితే తల్లిదండ్రులు కొన్ని సాధారణ దశలను అనుసరించటం వలన తమ పిల్లలను హీట్ వేవ్ నుండి రక్షించుకోవచ్చు. మీ పిల్లలను తరచుగా నీళ్లు తాగటానికి ప్రోత్సహించాలి. పిల్లలు బయటికి వెళ్లేటప్పుడు వాళ్లతోపాటు ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్లాలా చూసుకోండి. అదే టైంలో చక్కెర,కృత్రిమంగా కార్బోనేటెడ్, శీతల పానీయాలు ఇలాంటివి తీసుకోవటం పరిమితం చేయండి.
వాటిని తాగటం వలన శరీరం అనేది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత ఎండలోకి వెళ్ళకూడదు. వేసవిలో మీ పిల్లలను ఎండలు తక్కువ ఉన్నప్పుడు మాత్రమే బయటకు పంపించాలి. సాయంత్రం వేళలో మాత్రమే బయట ఆడుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. పగటిపూట మీ పిల్లలను తగినంత హైడ్రేడ్ గా ఉండేలా చూసుకోవాలి. నిమ్మకాయ నీళ్లు, లస్సి, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, సబ్జా వాటర్ లాంటివి ఇస్తూ ఉండాలి..
కాటన్,నారా లాంటి దుస్తులు శరీర ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ సహజమైన, తేలికపాటి బట్టలను మీ పిల్లల కోసం ఎంచుకోండి. దుస్తులు సరిగ్గా ఉంటేనే పిల్లలు కూడా చిరాకు పడకుండా ఉంటారు. రోజులో ఎక్కువ వేడిగా ఉన్న టైంలో ఇండోర్ కార్యకలాపాలను ప్రోత్సహించండి. గొడుగులు, టోపీలు బహిరంగ కార్యకలాపాలను ప్రత్యక్షంగా గురికాకుండా ఉండేందుకు ఉపయోగించవచ్చు.
మీరు బయటికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాస తీసుకోవడంలో సమస్యలు, తలనొప్పి, తలతిరగటం, మూత్ర విసర్జన తగ్గటం లాంటి లక్షణాలు మీకు కనిపించినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించటం చాలా మంచిది. అలాగే అలాంటి లక్షణాలు గురించి పిల్లలకు అవగాహన పెంచడంకూడా చాలా అవసరం. వేడి బహిర్గతం కావటం వలన అసౌకర్యంగా ఉంటుంది అని వారికి చెప్పాలి.
అలాగే పిల్లలను ఎండల్లో ఆడుకోనీయకూడదు. అంతేకాక ఈ వేసవి తాపం తట్టుకోలేందుకు చాలా వరకు పిల్లలు ఈ మధ్య స్విమ్మింగ్ పూల్స్ కి వెళ్తారు. ఈ స్విమ్మింగ్ పూల్స్ కూడా ప్రమాదం.అలాంటి పరిస్థితులలో స్విమ్మింగ్ పూల్స్ దగ్గర నిపుణుల పర్యవేక్షణ లేక పిల్లల తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండేటట్లు చూసుకోవాలి..