Sesame oil benefits : నువ్వుల నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...
ఇలా చేయటం వలన చర్మ సమస్యలు దూరం అవుతాయి. చాలామంది పచ్చళ్లను కూడా నువ్వుల నూనెతో పెట్టేవారు. నువ్వులు ఎంత ఆరోగ్యమో నువ్వుల నూనె కూడా మనకు అంతే విధంగా పనిచేస్తాయి. నువ్వులు తీసుకోవటం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా నువ్వులు తిన్నట్లయితే రక్తహీనత సమస్యల నుండి బయటపడతారు.

నువ్వుల నూనెలో పోషకాలు విటమిన్లు బీ, ఇ,కార్బోహైడ్రేట్స్,ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాక పాస్పరస్, కాలుష్యం, మెగ్నీషియం కూడా ఇందులో ఉన్నాయి. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు,ఫంగల్ లాంటి గుణాలు ఎక్కువగా ఉన్నాయి.
పూర్వం వాళ్లు నువ్వుల నూనెను ఎక్కువగా ఒంటికి రాసుకునేవాళ్లు.శరీరానికి నువ్వుల నూనెతో మర్దన చేసి అభ్యంగన స్నానలు చేసేవారు. నువ్వుల నూనె రాయటం వలన చర్మం మృదువుగా, కాంతివంతంగా మెరుస్తుంది. ముడతలు, మొటిమలు లాంటివి కూడా రాకుండా ఉంటాయి. అంతేకాక కాలుష్యం, యూవి కిరణాలు నుండి చర్మ కణాలను రక్షించడానికి ఈ ఆయిల్ చాలా చక్కగా పనికి వస్తుంది.

అయితే ఈ నూనెను వేసవి కాలంలో మాత్రం రాయకూడదు. దీనిలో వేడి చేసే గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల వర్షాకాలం, చలికాలంలో మాత్రమే దీనిని రాసుకోవాలి. నువ్వుల నూనె జుట్టుకు రాయడం వలన అవి దృఢంగా, బలంగా తయారు అవుతాయి. తలపై నూనెతో మర్దన చేసుకున్నట్లయితే స్కాల్ప్ పై రక్త ప్రసరణ బాగా జరగటం వలన జుట్టు పెరిగే అవకాశం ఉంది.
నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల కూడా కీళ్ల నొప్పులు,వాపు, అర్థరైటీస్ నుండి ఉపశమనం పొందవచ్చు.అంతేకాక ఈ నూనెను కాలిన ప్రదేశంలో గానీ గాయమైన దగ్గర గాని రాసినట్లయితే గాయాలు కూడా తొందరగా మానుతాయి. నిద్రలేని సమస్యలతో బాధపడేవారు నువ్వుల నూనె నుదుటిపైన మర్దన చేసుకున్నట్లయితే మంచి నిద్ర కూడా పడుతుంది.
కావున నిద్రలేని వారికి కూడా ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. నువ్వుల నూనె వలన ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అందువలన ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి.
